మరికొన్ని గంటల్లో.. క్రికెట్ ప్రపంచంలోనే కీలక మ్యాచ్ జరగబోతుంది. ముంబై వాఖండే స్టేడియంలో.. వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ టాస్ పడనుంది. ఇండియా, న్యూజిలాండ్ జట్లు ఫైనల్ బెర్త్ కోసం హోరాహోరీగా పోరాడనున్నాయి. ఈ క్రమంలోనే వాతావరణం అనేది కీలకంగా మారింది. కొన్ని రోజులుగా ముంబైలో పొల్యూషన్ తోపాటు వర్షం పడింది. దీంతో నవంబర్ 15వ తేదీ వాతావరణం ఎలా ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది.
ఉత్కంఠ మ్యాచ్ కావటంతో.. వాతావరణ శాఖ ప్రత్యేకంగా బులిటెన్ రిలీజ్ చేసింది. ముంబై వెదర్ ఇలా ఉంటుందని స్పష్టం చేసింది. నవంబర్ 15వ తేదీ బుధవారం ముంబై చాలా చాలా క్లియర్ గా ఉంటుంది. ఆకాశంలో మబ్బులు ఉండవు. వర్షం పడే సూచనలే లేవు. ఎండ కూడా 37 డిగ్రీల ఉష్ణోగ్రత గరిష్ఠంగా నమోదు అవుతుంది. రాత్రి టెంపరేచర్ సైతం 26 డిగ్రీలుగా ఉంటుంది. మ్యాచ్ కు వాతావరణం నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని తేల్చేసింది.
వాంఖడే స్టేడియంలో పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని ఇప్పటికే రిపోర్టులు వస్తున్నాయి. మరోవైపు వాతావరణ సైతం క్లియర్ గా ఉంది. టెంపరేచర్ ఎక్కువగా ఉండటంతో.. బ్యాటింగ్ కు మరింత అనుకూలంగా మారనుంది. సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్లకూ అనుకూలంగా ఉండనుంది వాతావరణం. ఎండ తీవ్రత, పిచ్ రిపోర్ట్ రెండింటినీ అంచనా వేస్తే.. ఫస్ట్ బౌలింగ్ చేసే వారికి.. ఫస్ట్ 10 ఓవర్లు బాగా కలిసి వస్తుందనే అంచనాలు ఉన్నాయి.
ALSO READ :- ఇండియా, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్కు బెదిరింపు.. ముంబై పోలీసులు అలెర్ట్