IND vs NZ: ఔట్ కాకుండానే.. మధ్యలోనే వెళ్లిపోయిన శుభ్‌మాన్ గిల్

IND vs NZ: ఔట్ కాకుండానే.. మధ్యలోనే వెళ్లిపోయిన శుభ్‌మాన్ గిల్

దూకుడుమీదున్న భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మ్యాచ్ మధ్యలో భారత ఓపెనర్ శుభ్‌మాన్ గిల్(79 నాటౌట్) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. కాలి కండరాలు పట్టేయడంతో అతడు బ్యాటింగ్ కొనసాగించలేకపోయాడు. దీంతో రిటైర్డ్ హర్ట్‌గా తప్పుకున్నాడు. అతని స్థానంలోశ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు.

also read :- IND vs NZ: మరో వరల్డ్ రికార్డు బ్రేక్.. సచిన్‌ను దాటేసిన కోహ్లీ
 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు మంచి ఆరంభం లభించింది. తొలి వికెట్‌కు రోహిత్ శర్మ(47)- గిల్ జోడి 71 పరుగులు జోడించారు. అనంతరం రోహిత్ వెనుదిరిగినా.. అక్కడినుండి ఆ భాద్యతను గిల్ కొనసాగించాడు. ఒకవైపు నిలకడగా ఆడుతూనే మరోవైపు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. గిల్ టైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగే సమయానికి టీమిండియా స్కోర్.. 22.4 ఓవర్లలో 163/1. ప్రస్తుతం కోహ్లీ(35 నాటౌట్), అయ్యర్(0) క్రీజులో ఉన్నారు.