భారత బ్యాటర్లు నిర్ధేశించిన 398 పరుగుల ఛేదనలో న్యూజిలాండ్ బ్యాటర్లు ధీటుగా బదులిస్తున్నారు. డెవాన్ కాన్వే(13) , రచిన్ రవీంద్ర(13) త్వరగానే పెవిలియన్ చేరినా.. కేన్ విలియమ్సన్(58 నాటౌట్), డారిల్ మిచెల్(90 నాటౌట్) జోడి భారత విజయానికి అడ్డుపడుతున్నారు. వీరిద్దరూ ఏకంగా మూడో వికెట్‌కు 160 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
మొదట్లో ఆచి తూచి ఆడినా కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్ క్రీజులో కుదురుకున్నాక భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఓవర్‌కు తొమ్మిది.. పది పరుగుల చొప్పున కొడుతూ రిక్వైర్డ్ రేట్‌ను అదుపులో ఉండేలా చూసుకుంటున్నారు. వీరిని విడగొట్టడానికి భారత బౌలర్లు చెమటోడుస్తున్నారు. రోహిత్ ఎన్ని వ్యూహాలు అములు చేసినా.. ప్రయత్నాలు సఫలం కావడం లేదు. 30 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ రెండు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. విలియమ్సన్ (58 నాటౌట్), డారిల్ మిచెల్ (90 నాటౌట్) పరుగులతో క్రీజులో ఉన్నారు.
Three 50s now in four World Cup games for Kane Williamson ? https://t.co/ptgFIHUKpk | #INDvNZ | #CWC23 pic.twitter.com/yZN7q9aJ1W
— ESPNcricinfo (@ESPNcricinfo) November 15, 2023
Daryl Mitchell hits his third fifty of this World Cup and gives New Zealand a lot of hope ? https://t.co/ptgFIHUKpk | #INDvNZ | #CWC23 pic.twitter.com/A0UT6fWWTY
— ESPNcricinfo (@ESPNcricinfo) November 15, 2023