భారీ లక్ష్య ఛేదనకు పాక్ పరువు నిలుపుకోవడానికి శక్తికి మించి పోరాడుతోంది. 20 ఓవర్లకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో పాక్ ఆల్‌రౌండర్ అఘా సల్మాన్ తీవ్రంగా గాయపడ్డాడు. జడేజా వేసిన 21వ ఓవర్‌లో స్వీప్ షాట్ ఆడబోయి.. కంటి దగ్గర తీవ్ర గాయపరుచుకున్నాడు. దీంతో రక్తం కారుతుండడంతో ఆ జట్టు ఫిజిషియన్ వెంటనే మైదానంలోకి పరుగెత్తుకు రావాల్సి వచ్చింది. అతనికి కాంకషన్ అవకాశం ఉన్నప్పటికీ.. తిరిగి బ్యాటింగ్ కొనసాగించడానికి అతను అంగీకరించాడు. కాసేపటి అంతరాయం అనంతరం మ్యాచ్ యధాతధంగా కొనసాగుతోంది.
Agha Salman bleeding after the ball hit near his eyes.
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 11, 2023
Great from KL Rahul to instantly check on him! pic.twitter.com/SDwbjMTJ92
357 పరుగుల లక్ష్య ఛేదనకు పాక్‌కు అధిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ జోడి పాక్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టారు. పాక్ ఓపెనర్ ఇమాముల్ హక్(9) పరుగులకే వెనుదిరగగా.. బాబర్ ఆజాం(10), మహమ్మద్ రిజ్వాన్(2) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. అనంతరం కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో మరో ఓపెనర్ ఫఖర్ జమాన్(27)ను బౌల్ట్ అవ్వడంతో పాక్ నాలుగో వికెట్ కోల్పోయింది.
Not a good sign. That's why helmet is important in cricket.
— CRICKET VIDEOS ? (@Abdullah__Neaz) September 11, 2023
Praying for your speedy recovery, Agha Salman ❤️#INDvPAK #INDvsPAK pic.twitter.com/yfB15PtdzM