IND vs PAK: అక్షర్ సూపర్‌ త్రో.. రెండో వికెట్ కోల్పోయిన పాక్

IND vs PAK: అక్షర్ సూపర్‌ త్రో.. రెండో వికెట్ కోల్పోయిన పాక్

పాకిస్థాన్ బ్యాటర్ల నిలకడ మూన్నాళ్ల ముచ్చటే అనిపిస్తోంది. దాయాది జట్టు కాస్త బాగానే ఆడుతుంది అనుకునే సమయానికి.. మళ్లీ మునుపటి దారి మళ్లారు. 8 ఓవర్ల వరకు వికెట్ పడకుండాకాపాడకుంటూ వచ్చిన పాక్.. ఆ మరుసటి రెండ్ ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం స్కోర్.. 10 ఓవర్లు ముగిసేసరికి 52/2. 

అక్షర్ సూపర్‌ త్రో..

మొదట పాండ్య దెబ్బకు బాబర్‌ అజామ్‌(23) వెనుదిరగ్గా.. అక్షర్ సూపర్‌ త్రోకు ఇమామ్‌ ఉల్ హక్(10) బలయ్యాడు. పవర్‌ ప్లే ఆఖరి ఓవర్‌ రెండో బంతిని మిడ్-ఆన్ వైపుగా ఆడిన ఇమామ్.. అనవసర పరుగుకు ప్రయత్నించి ఔటయ్యాడు. బౌలర్‌ ఎండ్‌లో అక్షర్‌ సూపర్‌ త్రో వేయడంతో.. పాక్ ఓపెనర్‌కు కళ్లు తిరిగాయి. బహుశా..! భారత ఫీల్డర్‌ను అతక్కువ అంచనా వేసిండొచ్చు. ప్రస్తుతం క్రీజులో రిజ్వాన్‌ (4), సౌద్‌ (3) ఉన్నారు.

Also Read :  రాణించిన పఠాన్ సోదరులు

అంతకుముందు వరుస ఫోర్లతో ఊపు మీదున్న బాబర్‌ అజామ్‌ (23)ను పాండ్య ఔట్‌ చేశాడు. దాంతో, పాక్ 41 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. దాయాది జట్టు 250పైచిలుకు పరుగులు చేస్తే తప్ప మ్యాచ్ హోరాహోరీగా ఉండదు.