ఎప్పుడు అందరి చేత పొగడ్తలతో మునిగే పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై అలాంటి పొగడ్తలే కురిపించాడు. బాబర్ ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడని కొనియాడిన ఈ మాజీ సారథి.. అతను మూడు ఫార్మాట్లలోనూ తిరుగులేని ఆటగాడని కితాబిచ్చాడు. స్టార్ స్పోర్ట్స్‌తో చిట్‌చాట్ సందర్భంగా విరాట్ ఈ వ్యాఖ్యలు చేశారు.
2019 వన్డే వరల్డ్‌కప్ సమయంలో విరాట్ కోహ్లీ.. బాబర్ ఆజాంతో ముచ్చిట్టించిన విషయం తెలిసిందే. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న కోహ్లీ.. బాబర్ చాలా మర్యాదస్తుడని తెలిపాడు. నాటి పాక్ జట్టు సభ్యుడు ఇమాద్ వసీంతో తనకు పరిచయం ఉందన్న కోహ్లీ.. పాక్‌తో మ్యాచ్ అనంతరం బాబర్ తనతో మాట్లాడాలని అనుకుంటున్నట్లు ఇమాద్ చెప్పాడని తెలిపాడు. తనే బాబర్‌ను పరిచయం చేసినట్లు చెప్పుకొచ్చాడు.
ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్
బాబర్ ఆజాంను తొలిసారి కలిసినప్పుడు చాలా మర్యాదగా వ్యవహరించాడని, ఇప్పటికే అదే మెయింటెయిన్ చేస్తూ వస్తున్నాడని కోహ్లీ తెలిపాడు. ఆరోజు బాబర్ తనతో.. నీ ఆటకు పెద్ద అభిమానినని అన్నాడని, వాస్తవానికి నేను కూడా బాబర్ ఆటకు అభిమానినేనని విరాట్ చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో తాను సాధించలేని రికార్డులను సైతం ఈ పాక్ కెప్టెన్ సాధించగలడంటూ ఆకాశానిత్తాడు. ఫార్మాట్లకతీతంగా బాబర్ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ అని కితాబిచ్చాడు.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో బాబర్ ఆజాం
ప్రస్తుతం బాబర్ ఆజాం ఐసీసీ అన్ని ఫార్మాట్లలోనూ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా కొనసాగుతున్న విహస్యం తెలిసిందే. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న అతడు.. మిగిలిన రెండు ఫార్మాట్లలో టాప్-5లో కొనసాగుతున్నాడు.
When champions meet in mutual respect and admiration - the spirit of sportsmanship prevails#BabarAzam? #ViratKohli? #cricketlovers #cricketfans pic.twitter.com/3uvLxBo8FH
— Zubair Shakeel Wani (@ZubiTalks) August 12, 2023
కాగా ఆసియా కప్-2023లో భాగంగా సెప్టెంబర్ 2న భారత్-పాక్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు శ్రీలంకలోని పల్లెకెలె ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీలో భారత్, పాక్‌లు మూడుసార్లు తలపడే అవకాశం ఉంది. ఆపై వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా మరోసారి తలపడనున్నాయి.