పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా.. బాల్‌పై ఏదో మంత్రం వేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం విదితమే. పాండ్యా అలా చేసిన వెంటనే ఇమామ్ ఉల్ హక్ వికెట్ పడటంతో.. అతని పేరు మార్మోగింది. పాండ్యా మంత్రాలు చదివాడని కొందరు, చేతబడి చేశాడని మరొకొందరు నానా హడావుడి చేశారు. కానీ, అవి మంత్రాలు.. చేతబడి రెండూ కాదట.
నోటికి దగ్గరగా పెట్టుకుని బంతితో ఏం మాట్లాడారన్న విషయంపై మాట్లాడిన పాండ్యా.. అవి తిట్లని తెలిపాడు. "బాల్‌పై ఎలాంటి మంత్రాలు వేయలేదు. ఓవైపు అందరూ వికెట్లు తీస్తుంటే.. నాకు పడకపోయేసరికి నాపై నాకే కోపం వచ్చింది. అందుకే నన్ను నేను తిట్టుకున్నా. లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలని చెప్పుకున్నా.. అంతే.." అని పాండ్యా చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 6 ఓవర్లు వేసిన పాండ్యా.. 34 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.
Kaunsa Mantra Fooka Bhai Ball Par ?#HardikPandya #INDvPAK pic.twitter.com/cOvyn5J1wK
— Deepak (@filmy_deepak) October 14, 2023
బంగ్లాతో పోరు
భారత జట్టు తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అక్టోబర్ 19న పూణే వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.