India vs Pakistan: దంచికొడుతున్న వర్షం.. ఆగిన మ్యాచ్

India vs Pakistan: దంచికొడుతున్న వర్షం.. ఆగిన మ్యాచ్

ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. ఆట ప్రారంభమైన కాసేపటికే వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. సిబ్బంది మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. కాగా, వర్షం అంతరాయం కలిగించే సమయానికి భారత్ 4.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(11), శుభ్ మాన్ గిల్(0) క్రీజులో ఉన్నారు.

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతున్న శ్రీలంకలోని పల్లెకెలెలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం కూడా వర్షం అడ్డుతగిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ నివేదికలు ముందుగానే హెచ్చరించాయి. సుమారు 90 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

వర్షం ఆగినా.. పలుమార్లు అడ్డంకులు

ప్రస్తుతానికి భారీ వర్షం కురుస్తోంది. ఒకవేళ వర్షం ఆగినప్పటికీ.. పలుమార్లు ఇదేరకంగా అంతరాయం కలిగించవచ్చు. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులందరూ ముందుగానే ప్రిపేర్ అయ్యి వచ్చాయి. స్టేడియం అంతటా గొడుగులు పట్టుకున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి.