IND vs PAK: రోహిత్ అరుదైన ఘనత.. సచిన్, గంగూలీల సరసన

IND vs PAK: రోహిత్ అరుదైన ఘనత.. సచిన్, గంగూలీల సరసన

దుబాయి వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘ‌న‌త సాధించాడు. వన్డేల్లో 9వేల పరుగులు పూర్తి చేసిన మూడో భారత ఓపెనర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఎదుర్కొన్న రెండవ బంతికే హిట్‌మ్యాన్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. 

ALSO READ | Virat Kohli: 14 వేల క్లబ్‎లో కోహ్లీ.. ప్రపంచంలోనే మూడో బ్యాటర్‎గా రికార్డ్

ఈ ఘనత సాధించిన మరో ఇద్దరు భారత క్రికెటర్లు..  సచిన్ టెండూల్కర్,  సౌరవ్ గంగూలీ మాత్రమే. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో చూస్తే.. ఓపెనర్‌గా ఈ ఘనత సాధించిన ఆరవ బ్యాటర్ రోహిత్.

వన్డే క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు

  • 1. సచిన్ టెండూల్కర్: 15310 పరుగులు
  • 2. సనత్ జయసూర్య: 12740 పరుగులు
  • 3. క్రిస్ గేల్: 10179 పరుగులు
  • 4. ఆడమ్ గిల్‌క్రిస్ట్: 9200 పరుగులు
  • 5. సౌరవ్ గంగూలీ: 9146 పరుగులు
  • 6. రోహిత్ శర్మ: 9019 పరుగులు

రోహిత్ క్లీన్ బౌల్డ్

దాయాది జట్టుతో జరుగుతోన్న ప్రతిష్టాత్మక మ్యాచులో రోహిత్ శర్మ నిరాశపర్చాడు. 4, 6, 4 బాది మంచి టచ్‎లో కనిపించిన హిట్‎మ్యాన్ దూకుడుగా ఆడే క్రమంలో వికెట్ పారేసుకున్నాడు. పాక్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిదీ వేసిన అద్భుతమైన యార్కర్‎కు రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మొత్తం 15 బంతులు ఎదుర్కొన్న హిట్ మ్యాన్.. 20 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇనింగ్స్ లో 3 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.