వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ తన పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నాడు. తనను ఎంతగానో ఊరించిన 49 వ సెంచరీ ఎట్టలకే కొట్టేసాడు. తన పుట్టిన రోజున అభిమానులకి మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ.. ఈ సెంచరీతో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వన్డేల్లో నెలకొల్పిన అత్యధిక సెంచరీల రికార్డ్(49) ను సమం చేసాడు. ఈ వరల్డ్ కప్ లో కోహ్లీకి ఇది రెండో సెంచరీ. కోహ్లీ ఇన్నింగ్స్ తో ఈడెన్ గార్డెన్ లో సౌత్ ఆఫ్రికాపై జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ చేసింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ తీసుకోగా రోహిత్, గిల్ భారత్ కు మెరుపు శుభారంభాన్ని అందించారు. 42 పరుగులు చేసిన తర్వాత రోహిత్ ఔటయ్యాడు. ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ ఆచితూచి ఆడాడు. ప్రారంభంలో బౌండరీలతో అలరించిన కోహ్లీ.. ఆ తర్వాత నిదానంగా బ్యాటింగ్ చేసాడు. ఈ క్రమంలో 67 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా.. 119 బంతుల్లో తన రికార్డ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు ఉన్నాయి.
ALSO READ : ODI World Cup 2023: ఆ బుర్ర ఎవరిదో దేవుడికే తెలియాలి.. పాకిస్తాన్ కోచ్‌పై సెహ్వాగ్ సెటైర్లు
??????? in Kolkata for the Birthday Boy! ??
— BCCI (@BCCI) November 5, 2023
From scoring his Maiden century in Kolkata to scoring his 4⃣9⃣th ODI Ton ??#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvSA pic.twitter.com/pA28TGI4uv