డర్బన్: టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి టీమిండియా 202 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ముందు 203 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. సంజూ శాంసన్ 50 బంతుల్లో 107 పరుగులు చేసి సెంచరీతో అదరగొట్టాడు.
పవర్ ప్లేలో శాంసన్ చెలరేగాడు. 10 సిక్సులు, 7 ఫోర్లతో సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తిలక్ వర్మ 33 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 21 పరుగులు చేశారు. అభిషేక్ శర్మ 7 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. హార్థిక్ పాండ్యా 2 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. రింకూ సింగ్ 11, అక్షర్ పటేల్ 7, అర్ష్‌దీప్ సింగ్ 5 పరుగులు (నాటౌట్) చేశారు.
ఒకానొక దశలో టీమిండియా స్కోర్ 220 దాటిపోతుందని అనిపించినప్పటికీ సంజూ శాంసన్ తర్వాత ఆడిన ఆటగాళ్లు బ్యాటింగ్‌లో పెద్దగా రాణించకపోవడంతో 202 పరుగులకు టీమిండియా పరిమితమైంది. టీ20ల్లో 202 పరుగులు గౌరవప్రదమైన స్కోరే కావడం గమనార్హం. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ 3 వికెట్లతో రాణించాడు. ఎంకాబయోమ్జీ పీటర్, మార్కో జెన్సెన్, ప్యాట్రిక్ క్రూగర్, కేశవ్ మహరాజ్‌కు తలో వికెట్ దక్కింది.