సఫారీ గడ్డపై విజయదుందుభి మోగించాలనుకున్న భారత్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌లో ఏకధాటిగా వర్షం కురుస్తుండడంతో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి టీ20 రద్దయ్యింది. కనీసం టాస్ కూడా పడలేదు.
నిన్నటి నుంచి కింగ్స్‌మీడ్‌లో వర్షం కురుస్తుండటంతో మైదాన సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి తగ్గుముఖం పడుతుందని భావించినా అది జరగలేదు. ఓ మోస్తరు వర్షం కురుస్తూనే ఉంది. ఒకవేళ వర్షం తగ్గు మొహం పట్టినా ఔట్‌ఫీల్డ్ చిత్తడిగా మారడంతో ఆట కొనసాగించడం సాధ్యపడదని అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Not so great news from Durban as the 1st T20I has been called off due to incessant rains.#SAvIND pic.twitter.com/R1XW1hqhnf
— BCCI (@BCCI) December 10, 2023
రెండో టీ20
ఈ ఇరు జట్ల మధ్య గెబర్హా వేదికగా మంగళవారం (డిసెంబర్ 12) రెండో టీ20 జరగనుంది.