సొంతగడ్డపై దక్షిణాఫ్రికా బ్యాటర్లు ధీటుగా బదిలిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 245 పరుగుల వద్ద ఆలౌట్ కాగా, సఫారీ జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. టీ బ్రేక్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. సఫారీ బ్యాటర్ డీన్ ఎల్గర్‌సెంచరీ(140 బంతుల్లో 101, 19 ఫోర్లు)తో కదం తొక్కాడు. టెస్టులలో అతడికిది 14వ సెంచరీ.
అంతకుముందు దక్షిణాఫ్రికా ఆరంభంలోనే ఎయిడెన్ మార్క్‌రమ్ వికెట్ కోల్పోయింది. 5 పరుగుల వద్ద మార్క్‌రమ్.. సిరాజ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం వన్ డౌన్‍లో వచ్చిన టోనీ డి జోర్జి (28), సెకండ్ డౌన్‌లో వచ్చిన కీగన్ పీటర్సన్ (2)ను.. బుమ్రా వెనక్కు పంపాడు.
8️⃣4️⃣ Test Matches
— Proteas Men (@ProteasMenCSA) December 27, 2023
5️⃣1️⃣4️⃣6️⃣ Runs
2️⃣3️⃣ Fifties
1️⃣3️⃣ Tons
Dean Elgar's last dance gets underway as he steps to the crease at SuperSport Park ??#ThankYouDean #WozaNawe#BePartOfIt pic.twitter.com/m3FQNj4K9v
పసలేని ప్రసిధ్, ఠాకూర్
పేసీ పిచ్‌పై సఫారీ బౌలర్లు చెలరేగిపోగా.. మన పేసర్లు మాత్రం అందకు భిన్నంగా బౌలింగ్ చేస్తున్నారు. వికెట్లు తీయడం పక్కనపెడితే, కనీసం ఇబ్బంది పెట్టే బంతులు కూడా వేయట్లేరు. బుమ్రా, సిరాజ్ కాస్త ఫర్వాలేదనిపించినా.. లార్డ్ శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణలు వికెట్లు తీయకపోగా ధారాళంగా పరుగులిస్తున్నారు. వీరిద్దరి వైఫల్యాన్ని ఎల్గర్ సొమ్ము చేసుకున్నాడు. చివరి సెషన్ లో అయినా భారత బౌలర్లు విజృంభించాలి. లేదంటే మ్యాచ్ చేజారినట్టే.