సొంతగడ్డపై సఫారీ బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. పదునైన పేస్కు బౌన్స్ జోడించి ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా ఆ జట్టు ప్రధాన పేసర్ కగిసో రబడా దెబ్బకు భారత బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. రబడా విజృంభణతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా 120 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 5 పరుగులకే రోహిత్ శర్మ పెవిలియన్ చేరాడు. ఆపై వెనువెంటనే యశస్వి జైస్వాల్(17), శుభ్ మాన్ గిల్() కూడా ఔట్ అవ్వడంతో టీమిండియా 24 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో విరాట్ కోహ్లీ (38), శ్రేయస్ అయ్యర్(31) జోడి కాసేపు ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
Rohit Sharma ?
— CricTracker (@Cricketracker) December 26, 2023
Shreyas Iyer ?
Virat Kohli ?
Kagiso Rabada flying high here at Centurion? pic.twitter.com/2g0TvA9It3
లంచ్ విరామం అనంతరం టీమిండియాకు మరోసారి కష్టాల్లో పడింది. లంచ్ విరామం తరువాత రబాడా వేసిన మొదటి ఓవర్లోనే అయ్యర్ ఔట్ అయ్యాడు. దీంతో భారత్ నాలుగో వికెట్ కోల్పోఔట్ యింది. ఆపై నిలకడగా ఆడుతున్న కోహ్లీ(38)ని రబడానే పెవిలియన్ చేర్చాడు. కాసేపటి తరువాత రవిచంద్రన్ అశ్విన్(8) రూపంలో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం రాహుల్(23 నాటౌట్), శార్దూల్ ఠాకూర్(19 నాటౌట్) క్రీజులో ఉన్నారు. వీరిద్దరిమీదనే టీమిండియా తొలి ఇన్నింగ్స్ ఆధారపడి ఉంది.
RABADA FIRE ? https://t.co/ijBl1mtJIA | #SAvIND pic.twitter.com/85kLrjafeJ
— ESPNcricinfo (@ESPNcricinfo) December 26, 2023