IND vs SA 1st Test: టీమిండియా ఘోర ఓటమి.. మూడు రోజులకే ముగిసిన తొలి టెస్ట్

IND vs SA 1st Test: టీమిండియా ఘోర ఓటమి.. మూడు రోజులకే ముగిసిన తొలి టెస్ట్

సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలుస్తాం..  గత చరిత్ర గణాంకాలను మూలకు విసిరేస్తాం అంటూ ప్రగల్భాలు పలికిన భారత క్రికెటర్లు 72 గంటలు గడవకముందే తలకిందులయ్యారు. సఫారీ ఆటగాళ్లకు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. సెంచూరియ‌న్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా పరాజయం పాలైంది. ఇన్నింగ్స్ 34 పరుగుల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగులు చేసిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్ లో 131 పరుగులకే ఆలౌటైంది.      

కేఎల్ రాహుల్ సెంచరీ చేయడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగులు వద్ద ఆలౌట్ అయ్యింది. అనంతరం దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 408 పరుగులు చేసింది. దీంతో సఫారీ జట్టుకు తొలి ఇన్నింగ్స్ లో 163 పరుగుల ఆధిక్యం లభించింది. ఆపై సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత బ్యాటర్లు 131 పరుగులకే కుప్పకూలారు. రెండో ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ(76) ఒక్కడే కాసేపు పోరాడాడు. సఫారీ బౌలర్ల పోరాటమటిమను కూడా మన బ్యాటర్లు చూపలేకపోయారు. క్రీజులో నిలబటానికే ఆసక్తి చూపలేదు. రోహిత్ డకౌట్ కాగా, గిల్(26), జైస్వాల్(5), అయ్యర్(6), రాహుల్(4), అశ్విన్‌(0).. ఇలా ఒకరివెంట మరొకరు పెవిలియన్ చేరారు.

1992, 1996, 2001, 2006, 2010, 2013, 2018, 2021 & 2023 ❌

India will yet again go home without a Test series win in South Africa #SAvIND pic.twitter.com/lSnbWWBCoz

— ESPNcricinfo (@ESPNcricinfo) December 28, 2023

మూడు రోజులే

తొలి రోజు వర్షం అంతరాయం, రెండో రోజు వెళుతురు లేమి కారణంగా ఆటకు అనంతరం కలిగినా మూడు రోజులకే తొలి టెస్ట్ ముగియటం గమనార్హం. భారత బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్ లలోనూ కలిపి 100 ఓవర్లు మాత్రమే ఆడారు.

??THE PROTEAS LEAD THE FREEDOM SERIES

A mammoth all-round effort from the Proteas to take a 1-0 lead in the #Betway Test Series????

What a victory by the boys ??

The Final Frontier Continues ?#WozaNawe #BePartOfIt #SAvIND pic.twitter.com/MFWVAgphxS

— Proteas Men (@ProteasMenCSA) December 28, 2023