మరో మూడు బంతుల్లో భారత ఇన్నింగ్స్ ముగుస్తుందనంగా వర్షం అంతరాయం కలిగించింది. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. మైదాన సిబ్బంది కవర్లతో పిచ్‌ను కప్పి ఉంచారు. ప్రస్తుతానికి గెబెర్హాలో నిలకడగా వర్షం కురుస్తోంది. భారత బ్యాటర్లు మరోసారి బ్యాటింగ్ చేయడం అనుమానమే. కాగా, వర్షం కారణంగా తొలి టీ20 రద్దయిన విషయం తెలిసిందే.
ఆట నిలిచిపోయే సమయానికి భారత జట్టు 19.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. రింకూ సింగ్(68; 39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), మహమ్మద్ సిరాజ్(0) క్రీజులో ఉన్నారు. అంతకుముందు మిస్టర్ ఇండియా 360 సూర్యకుమార్ యాదవ్(56; 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ బాదాడు.
UPDATE - Rain stops play in the 2nd T20I at St George's Park.#TeamIndia 180/7 after 19.3 overs.https://t.co/0sPVek9NdO #SAvIND pic.twitter.com/8KbhFaOOxA
— BCCI (@BCCI) December 12, 2023
Rinku CRUNCHES back-to-back sixes in the 19th!
— ESPNcricinfo (@ESPNcricinfo) December 12, 2023
Tune-in to the 2nd #SAvIND T20I LIVE on @starsportsindia
.
.
Tune-in to the 2nd #SAvIND T20I LIVE on @starsportsindia pic.twitter.com/vammUgyG98