సఫారీ పర్యటనను విజయంతో ప్రారంభించాలనుకున్న భారత్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లిన విషయం తెలిసిందే. డర్బన్‌లో ఏకధాటిగా వర్షం కురవడంతో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి టీ20 రద్దయ్యింది. మంగళవారం (డిసెంబర్ 12) ఈ ఇరు జట్లు సెయింట్ జార్జ్ పార్క్ (గెబర్హా) వేదికగా మరోసారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. అందునా సెయింట్ జార్జ్ పార్క్‌లో మన రికార్డులు అంతంత మాత్రమే.
ఇప్పటివరకూ ఈ వేదికపై టీ20లు ఆడని భారత జట్టు.. వన్డేలు, టెస్టుల్లో మాత్రం దారుణంగా విఫలమైంది. ఆరు వన్డేల్లో ఐదింట ఓటమి పాలవ్వగా.. చివరిసారి 2018లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఇక టెస్ట్‌ల విషయానికొస్తే.. రెండు ఆడగా.. ఒకదానిలో ఓడిపోతే మరొకటి డ్రాగా ముగిసింది. ఇప్పుడైనా విజయం సాధించి ఆ రికార్డుల నుంచి కాస్తైనా ఉపశమనం కలిగించాలని భారత క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.
సెయింట్ జార్జ్ పార్క్‌లో టీమిండియా రికార్డులు
- వన్డేలు(6): గెలిచినవి- 1; ఓడినవి- 5
- టెస్టులు(2): గెలిచినవి- 0; ఓడినవి-1, డ్రా -1
Hello and welcome to St George's Park, our venue for the 2nd T20I against South Africa.#SAvIND pic.twitter.com/YJ6dm7qKPC
— BCCI (@BCCI) December 12, 2023