IND vs SA: చెమ్మచెక్క చారడేసి మొగ్గ.. మైదానంలో కోహ్లీ, గిల్ పిల్లాటలు

IND vs SA: చెమ్మచెక్క చారడేసి మొగ్గ.. మైదానంలో కోహ్లీ, గిల్ పిల్లాటలు

చెమ్మచెక్క.. చారడేసి మొగ్గా
అట్లు పొయ్యంగా.. ఆరగించంగా

ముత్యాల చెమ్మచెక్క.. ముగ్గులెయ్యంగా
రతనాల చెమ్మచెక్క.. రంగులెయ్యంగా
పగడాల చెమ్మచెక్క. పదిరెయ్యంగా
పందిట్లో మా బావ.. పెండ్లి చెయ్యంగా

సూర్య దేవుడి పెండ్లి.. చూసి వద్దాం రండి
మా వాళ్ళింట్లోకి వెళ్ళి.. మళ్లీ వద్దాం రండి

ఈ పాట గుర్తుందా..! మన అక్కాచెల్లెళ్లు, చిన్నాన్న పెదనాన్న పిల్లలు కలిసి ఎదురు బొదురుగా నిలబడి, చేతులు చాచి, ఒకరి చేతులు మరొకరికి తాటిస్తూ.. ఎగురుతూ, గెంతుతూ, వెనకకు ముందుకూ వూగుతూ పాటలు పాడేవారు. అదీ వరుస క్రమం తప్పకుండా వలయాకారంగా నృత్యం చేస్తుంటే చూడడానికి ఎంత బాగుందేదో కదా..! ఆ జ్ఞాపకాలను, మధురానుభూతాలను మన భారత క్రికెటర్లు ఇప్పుడు గుర్తుచేశారు. ఒకవైపు హోరాహారీగా మ్యాచ్ జరుగుతుంటే, మరోవైపు చెమ్మచెక్క.. చారడేసి మొగ్గా అంటూ గెంతులేశారు.

కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు గెలుపొందిన విషయం తెలిసిందే. ఫలితంగా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ను 1-1తో సమం చేసింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఒకానొక సందర్భంలో భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, శుభ్ మాన్ గిల్ ఆడిపాడారు. ఒకరి చేతులు మరొకరు పట్టుకొని గుండ్రంగా తిరుగుతూ గెంతులేశారు. వీరి పిల్ల ఆటలు చూసి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.