సిరీస్‌‌‌‌‌‌‌‌ ఎవరిదో?.. ఇవాళ ఇండియా, సౌతాఫ్రికా మూడో వన్డే

సిరీస్‌‌‌‌‌‌‌‌ ఎవరిదో?.. ఇవాళ ఇండియా, సౌతాఫ్రికా మూడో వన్డే
  •     తిలక్‌‌‌‌‌‌‌‌, రుతురాజ్‌‌‌‌‌‌‌‌కు ఆఖరి చాన్స్‌‌‌‌‌‌‌‌
  •     జోరుమీదున్న సఫారీలు
  •     సా. 4.30 నుంచి స్టార్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌లో

పార్ల్‌‌‌‌‌‌‌‌ (సౌతాఫ్రికా): తొలి రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌తో ఇబ్బందిపడిన టీమిండియా.. సౌతాఫ్రికాతో మూడో వన్డేకు రెడీ అయ్యింది. గురువారం జరిగే ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఎలాగైనా గెలిచి సఫారీ గడ్డపై రెండోసారి సిరీస్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకోవాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుంది. 2018లో ఇక్కడ చివరిసారి వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన ఇండియా.. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ కోసం తుది జట్టులో మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌కు టైమ్‌‌‌‌‌‌‌‌ దగ్గరపడుతుండటం, వన్డేలు ఎక్కువగా ఆడే చాన్స్‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో జట్టులో ఉన్న ఇతర ప్లేయర్లను పరీక్షించాలని భావిస్తోంది. తొలి రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో నిరాశపర్చిన రుతురాజ్‌‌‌‌‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌‌‌‌‌, తెలుగు బ్యాటర్‌‌‌‌‌‌‌‌ తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మలో ఒకర్ని తప్పించి రజత్‌‌‌‌‌‌‌‌ పటీదార్‌‌‌‌‌‌‌‌ను తీసుకునే యోచన చేస్తున్నారు.

 మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌ తరఫున నాలుగో నంబర్‌‌‌‌‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తుండటం రజత్‌‌‌‌‌‌‌‌కు అనుకూలంగా మారింది. శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ భారం ఎక్కువగా సాయి సుదర్శన్‌‌‌‌‌‌‌‌, కెప్టెన్‌‌‌‌‌‌‌‌ కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌పైనే పడింది. వచ్చిన అవకాశాలను సంజూ శాంసన్‌‌‌‌‌‌‌‌ వినియోగించుకోలేకపోవడం ఇండియాకు ప్రతికూలాంశం. టీ20ల్లో సూపర్‌‌‌‌‌‌‌‌ హిట్టర్‌‌‌‌‌‌‌‌ రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌ కూడా అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. బోలాండ్‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌పై మంచి బౌన్స్‌‌‌‌‌‌‌‌ ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో బ్యాటర్లు చెలరేగితే భారీ స్కోరు ఖాయం. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనూ ఇండియాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పేసర్‌‌‌‌‌‌‌‌ ముకేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ ఇంత వరకు ఖాతా తెరవలేదు. తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఆకట్టుకున్న అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌, అవేశ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ రెండో వన్డేలో ఫెయిలయ్యారు. కాబట్టి ముకేశ్‌‌‌‌‌‌‌‌తో పాటు ఈ ఇద్దరూ కూడా గాడిలో పడితే సౌతాఫ్రికాను తక్కువ స్కోరుకు పరిమితం చేయొచ్చు. సిరీస్‌‌‌‌‌‌‌‌ ముగింపుకు చేరుకోవడంతో వెటరన్‌‌‌‌‌‌‌‌ లెగ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ యుజ్వేంద్ర చహల్‌‌‌‌‌‌‌‌కూ ఓ చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ భావిస్తోంది. ఇది జరగాలంటే కుల్దీప్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌, అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌లో ఒకర్ని తప్పించాల్సి ఉంటుంది. 

సిరీస్‌‌‌‌‌‌‌‌పై గురి..

రెండో వన్డేలో తన బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ చూపెట్టిన సౌతాఫ్రికా ఇప్పుడు సిరీస్‌‌‌‌‌‌‌‌పై గురి పెట్టింది. ఓపెనర్‌‌‌‌‌‌‌‌ డి జోర్జి ఫుల్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉండటం సఫారీలకు అతిపెద్ద బలంగా మారింది. క్వింటన్‌‌‌‌‌‌‌‌ డికాక్‌‌‌‌‌‌‌‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న అతను మరో సెంచరీపై గురి పెట్టాడు. కొత్త పేస్‌‌‌‌‌‌‌‌ బౌలర్‌‌‌‌‌‌‌‌ నాండ్రీ బర్గర్‌‌‌‌‌‌‌‌ కూడా న్యూ బాల్‌‌‌‌‌‌‌‌తో ఇండియాను ముప్పు తిప్పలు పెట్టాడు. ప్రస్తుతం  ప్రొటీస్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా ఈ ఇద్దరిపైనే ఆశలు పెట్టుకుంది. రీజా హెండ్రిక్స్‌‌‌‌‌‌‌‌, మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌, డసెన్‌‌‌‌‌‌‌‌ కూడా భారీ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌పై దృష్టి పెట్టారు. క్లాసెన్‌‌‌‌‌‌‌‌, మిల్లర్‌‌‌‌‌‌‌‌ ఫినిషింగ్‌‌‌‌‌‌‌‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ వియాన్‌‌‌‌‌‌‌‌ ముల్డర్‌‌‌‌‌‌‌‌ తన సత్తా చూపేందుకు రెడీ అవుతున్నాడు. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో నాండ్రీ బర్గర్‌‌‌‌‌‌‌‌కు తోడుగా లిజాద్‌‌‌‌‌‌‌‌ విలియమ్స్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉండటం కలిసొచ్చే అంశం. బ్యూరాన్‌‌‌‌‌‌‌‌ హెండ్రిక్స్‌‌‌‌‌‌‌‌ కూడా చెలరేగితే ఇండియాకు కష్టాలు తప్పవు. స్పిన్నర్‌‌‌‌‌‌‌‌గా కేశవ్‌‌‌‌‌‌‌‌ మహారాజ్‌‌‌‌‌‌‌‌, మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌ కూడా తమ ప్రభావం చూపిస్తున్నారు. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ గెలిచి సిరీస్‌‌‌‌‌‌‌‌ను చేజారకుండా చూడాలని సఫారీలు లక్ష్యంగా పెట్టుకున్నారు. 

తుది జట్టు (అంచనా)

ఇండియా: కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), సాయి సుదర్శన్‌‌‌‌‌‌‌‌, రుతురాజ్‌‌‌‌‌‌‌‌ / తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ / రజత్​ పటీదార్‌‌‌‌‌‌‌‌, సంజూ శాంసన్‌‌‌‌‌‌‌‌, రింకూ సింగ్, అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌, కుల్దీప్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ / యుజ్వేంద్ర చహల్‌‌‌‌‌‌‌‌, అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, అవేశ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌, ముకేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌. 

సౌతాఫ్రికా: మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), రీజా హెండ్రిక్స్‌‌‌‌‌‌‌‌, టోనీ డి జోర్జి, డసెన్‌‌‌‌‌‌‌‌, క్లాసెన్‌‌‌‌‌‌‌‌, డేవిడ్ మిల్లర్‌‌‌‌‌‌‌‌, వియాన్‌‌‌‌‌‌‌‌ ముల్డర్‌‌‌‌‌‌‌‌, కేశవ్‌‌‌‌‌‌‌‌ మహారాజ్‌‌‌‌‌‌‌‌, నాండ్రీ బర్గర్‌‌‌‌‌‌‌‌, లిజాద్‌‌‌‌‌‌‌‌ విలియమ్స్‌‌‌‌‌‌‌‌, బ్యూరాన్‌‌‌‌‌‌‌‌ హెండ్రిక్స్‌‌‌‌‌‌‌‌.