టీమిండియా పరిమిత ఓవర్ల తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ ఏడాది తన టాప్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా వన్డేల్లో కేఎల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఐపీఎల్ లో గాయం తర్వాత ఆసియా కప్ లో ఎంట్రీ ఇచ్చిన రాహుల్.. తొలి మ్యాచ్ లోనే పాక్ పై సెంచరీ చేసి తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఆ తర్వాత వరల్డ్ కప్ లో అదరగొట్టిన ఈ కర్ణాటక బ్యాటర్..తాజాగా సౌత్ ఆఫ్రికా సిరీస్ లో రాణిస్తున్నాడు. రాహుల్ ఫామ్ ధాటికి 14 ఏళ్ళ తర్వాత ధోనీ సరసన నిలిచాడు.
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా నిన్న (డిసెంబర్ 21) భారత్ మూడో వన్డే ఆడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ద్వారా రాహుల్ ఒక అరుదైన ఘనత సాధించాడు. 35 బంతుల్లో 21 పరుగులు చేసిన రాహుల్ ఈ ఏడాది 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో 14 ఏళ్ళ తర్వాత భారత్ తరపున 1000 పరుగులు పూర్తి చేసిన తొలి వికెట్ కీపర్ గా నిలిచాడు. చివరిసారిగా భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 2009 లో 1198 పరుగులు చేసాడు. 2008 లో సైతం మహేంద్రుడు 1098 పరుగులు చేయడం గమనార్హం.
ఈ మ్యాచ్ లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఇండియా.. సఫారీ గడ్డపై రెండోసారి వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. బ్యాటింగ్‌లో సంజూ శాంసన్ (114 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 108), తిలక్ వర్మ (77 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 52), రింకూ సింగ్ (27 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) దంచికొట్టడంతో.. గురువారం జరిగిన ఆఖరిదైన మూడో వన్డేలో టీమిండియా 78 రన్స్ తేడాతో ప్రొటీస్‌ను చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది.
టాస్ గెలిచి సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 50 ఓవర్లలో 296/8 స్కోరు చేసింది. ఛేజింగ్‌లో సౌతాఫ్రికా 45.5 ఓవర్లలో 218 రన్స్‌కు ఆలౌటైంది. టోనీ డి జోర్జి (81) పోరాడినా మిగతా వారి నుంచి సహకారం అందలేదు. అర్ష్‌దీప్ 4 వికెట్లు తీశాడు. శాంసన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, అర్ష్‌దీప్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
KL Rahul completes 1000 ODI runs in 2023 and equals MS Dhoni's unique feat#klrahul #msdhoni #INDvsSA #SanjuSamsonhttps://t.co/PJs670IKTi
— IndiaTVSports (@IndiaTVSports) December 21, 2023