IND vs SA 3rd ODI: శతకం బాదిన శాంస‌న్.. సఫారీల ఎదుట భారీ లక్ష్యం

IND vs SA 3rd ODI: శతకం బాదిన శాంస‌న్.. సఫారీల ఎదుట భారీ లక్ష్యం

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ డిసైడ‌ర్ పోరులో భారత బ్యాటర్లు పర్వాలేదనిపించారు. మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్(108; 114 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) సెంచరీతో కదం తొక్కడంతో సఫారీల ఎదుట 297 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించారు.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత జట్టుకు ర‌జ‌త్ పటిదార్(22) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. కెరీర్ లో తొలి మ్యాచ్ ఆడుతున్నా.. సఫారీ బౌలర్లపై దూకుడు కనపరిచాడు. తొలి వికెట్ కు సాయి సుద‌ర్శన్ తో కలిసి 34 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ధాటిగా ఆడే ప్రయత్నంలో బ‌ర్గర్ బౌలింగ్ లో పటిదార్ క్లీన్ బౌల్డ‌య్యాడు. ఆపై కాసేటికే ఫామ్‌లో ఉన్న సుద‌ర్శన్‌ను హెండ్రిక్స్ ఎల్బీగా వెన‌క్కి పంపాడు. దీంతో భారత జట్టు 49 ప‌రుగుల‌కే రెండు కీల‌క వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో కేఎల్ రాహుల్, శాంస‌న్ జట్టును ఆదుకునే ప్ర‌య‌త్నం చేశారు. 

అనంతరం 21 పరుగుల వద్ద కెప్టెన్ కేఎల్ రాహుల్‌‍ను మ‌ల్డర్ పెవిలియ‌న్ పంపడంతో మరోసారి టీమిండియాకు కష్టాలు మొదలయ్యాయి. ఆ సమయంలో తిలక్ వర్మ((52))- శాంస‌న్() జోడి సఫారీలను ధీటుగా ఎదుర్కున్నారు. మొదట ఆచి తూచి ఆడిన ఈ జోడి కుదురుకున్నాక దూకుడు చూపెట్టారు. ఈ క్రమంలో రెండున్న‌రేళ్ల‌ నిరీక్షిణకు తెరదించాడు. ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ‌పై సెంచ‌రీ కొట్టాడు. చివరలో తిలక్ వ‌ర్మ వెనుదిరిగాక క్రీజులోకి వ‌చ్చిన రింకూ సింగ్(38; 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మునుపటిలానే బ్యాట్ ఝుళిపించడంతో టీమిండియా 296 పరుగుల భారీ స్కోర్ చేసింది.

సఫారీ బౌలర్లలో హెండ్రిక్స్ 3 వికెట్లు పడగొట్టగా, బ‌ర్గర్ 2, విలియమ్స్, మల్డర్, కేశవ్ మహరాజ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.