బోలాండ్ పార్క్ వేదికగా నేడు భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువ క్రికెటర్ రజిత్ పటీదార్ వన్డేల్లోకి అరంగ్రేటం చేయనున్నాడు.
తుది జట్లు
దక్షిణాఫ్రికా: టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్‌రమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్ , కేశవ్ మహారాజ్, నాండ్రే బర్గర్, లిజాద్ విలియమ్స్, బ్యూరాన్ హెండ్రిక్స్.
ఇండియా: సాయి సుదర్శన్, సంజు శాంసన్, రజత్ పటీదార్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(కెప్టెన్/ వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.