IND vs SA Final: ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విజేత ఎవరంటే..?

IND vs SA Final: ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విజేత ఎవరంటే..?

టీ20 వరల్డ్ కప్ 2024 తుది సమరానికి చేరుకుంది. శనివారం (జూన్ 29) జరగనున్న ఫైనల్ ఫైట్ లో దక్షిణాఫ్రికా, భారత్ తలపడనున్నాయి. బార్బడోస్ లోని కెన్నింగ్ టన్ ఓవల్ లో ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఈ టోర్నీలో ఇరు జట్లు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ కు రావడంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయంమని క్రికెట్ ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మ్యాచ్ సాయంత్రం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేద్దామనుకున్న క్రికెట్ ఫ్యాన్స్ కు వర్షం విలన్ గా మారే అవకాశముంది. 

వాతావరణ నివేదికల ప్రకారం.. బార్బడోస్‌లో శనివారం (జూన్ 29) రోజంతా వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. 70 శాతం వర్షం కురుస్తుందని 
రిపోర్ట్స్ చెబుతున్నాయి. మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశాలు ఎక్కువ ఉండడం ఆందోళన కలిగిస్తుంది. శనివారం వర్షం కారణంగా మ్యాచ్ జరగడం సాధ్యం కాకపోయినా.. ఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్ డే ను కేటాయించారు. ఆదివారం (జూన్ 30) సాయంత్రం 8 గంటలకు మ్యాచ్ నిర్వహిస్తారు. ఒకవేళ ఆదివారం కూడా మ్యాచ్  వర్షం కారణంగా జరగకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. 

20 జట్లతో మొదలైన ఈ టోర్నీలో భారత్, దక్షిణాఫ్రికా జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. మొదటి సెమీస్ లో ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తు చేసి  సౌతాఫ్రికా ఫైనల్ కు చేరుకుంటే.. రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. బార్బడోస్‌లోని  కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియంలో టీమిండియా గెలిస్తే టీ20 వరల్డ్ కప్ రెండోసారి గెలుచుకున్న జట్టుగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల సరసన నిలుస్తుంది.