SL vs IND: ధీటుగా బదులిస్తోన్న లంక.. చెమటోడుస్తున్న భారత బౌలర్లు

SL vs IND: ధీటుగా బదులిస్తోన్న లంక.. చెమటోడుస్తున్న భారత బౌలర్లు

పల్లకెలె వేదికగా భారత్- శ్రీలంక మధ్య జరుగుతోన్న తొలి టీ20 హోరాహోరీగా సాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 214 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించగా.. ఛేదనలో ఆతిథ్య జట్టు ధీటుగా బదులిస్తోంది. 8 ఓవర్లు ముగిసేసరికి లంక వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు విజయానికి చివరి 84 బంతుల్లో 137 పరుగులు కావాలి. 

భారత బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బంతులేస్తున్నా.. లంక ఓపెనింగ్ ద్వయం కుశాల్ మెండిస్ (39; 25 బంతుల్లో), పథుమ్ నిశాంక (37; 23 బంతుల్లో) ఏ చిన్న అవకాశాన్ని ఇవ్వడం లేదు. భారత పేసర్లను, స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగులు రాబడుతున్నారు.

సమిష్టిగా రాణించిన భారత బ్యాటర్లు

అంతకుముందు భారత బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(58; 26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకం బాదగా.. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (40; 21 బంతుల్లో), శుభ్‌మన్ గిల్ (34; 16 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరికితోడు రిషబ్ పంత్(49; 33 బంతుల్లో) నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. లంక బౌలర్లలో పతిరణ 4, అసిత ఫెర్నాండో, దిల్షాన్ మధుశంక, హసరంగ తలో వికెట్ పడగొట్టారు.