IND vs SL: సూరీడు సరికొత్త చరిత్ర.. కోహ్లీ వరల్డ్ రికార్డు సమం

IND vs SL: సూరీడు సరికొత్త చరిత్ర.. కోహ్లీ వరల్డ్ రికార్డు సమం

టీమిండియా నయా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. శనివారం(జులై 27) శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అందుకున్న సూర్య.. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధికసార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డ్స్ అందుకున్న ఆటగాడిగా కోహ్లీతో సమంగా నిలిచాడు. అయితే, కోహ్లీతో పోలిస్తే సూర్య సగం మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించడం గమనార్హం. 

Also Read:-పారిస్ ఒలంపిక్స్.. తొలి రౌండ్‌లో పీవీ సింధు విజయం

కోహ్లీ 125 మ్యాచ్‌లకుగాను 16సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డులు అందుకోగా.. సూర్య 69 మ్యాచ్‌ల్లోనే ఈ మార్క్ చేరుకున్నాడు. ఈ జాబితాలో కోహ్లీ, సూర్య టాప్‌లో ఉండగా.. జింబాబ్వే బ్యాటర్ సికందర్ రాజా(15), మహమ్మద్ నబీ(14), విరందీప్ సింగ్(14), రోహిత్ శర్మ(14) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విజేతలు

  • సూర్యకుమార్ యాదవ్ (ఇండియా): 16 (69 మ్యాచ్‌లు)
  • విరాట్ కోహ్లీ (ఇండియా): 16 (125 మ్యాచ్‌లు)
  • సికందర్ రజా (జింబాబ్వే): 15 (91 మ్యాచ్‌లు)
  • విరందీప్ సింగ్ (మలేషియా): 14 (78 మ్యాచ్‌లు)
  • మహమ్మద్ నబీ (ఆఫ్ఘనిస్తాన్): 14 (159 మ్యాచ్‌లు)

పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు

శనివారం శ్రీలంకతో జరిగిన తొలి టీ20 ద్వారా పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన సూర్య మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. 26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 58 పరుగులు చేశాడు. ఫలితంగా, టీమిండియా.. లంక ఎదుట 214 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. అనంతరం ఛేదనలో లంకేయులు 19.2 ఓవర్లలో 170 పరుగుల వద్ద ఆలౌటై 43 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు.