IND vs SL 2nd ODI: ఏడే పరుగులు.. ధోని రికార్డు బద్దలు కొట్టనున్న రోహిత్ శర్మ

IND vs SL 2nd ODI: ఏడే పరుగులు.. ధోని రికార్డు బద్దలు కొట్టనున్న రోహిత్ శర్మ

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌, శ్రీలంక జట్ల మధ్య నేడు(ఆగష్టు 4) రెండో మ్యాచ్ జరుగుతోంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తోంది. టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును అధిగమించడానికి కేవలం ఏడు పరుగుల దూరంలో ఉన్నాడు. ఆ రికార్డు ఏంటి..? హిట్‌మ్యాన్ చేధించే అవకాశాలు ఎంత..? అనేది తెలుసుకుందాం..

తొలి వన్డేలో 58 పరుగులు చేసిన రోహిత్ శర్మ 50 ఓవర్ల ఫార్మాట్‌లో 10,767 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్ మరో ఏడు పరుగులు చేస్తే 10,773 పరుగులతో ధోనిని అధిగమించి ఐదో స్థానానికి చేరుకున్నాడు. అది కూడా ధోనితో పోలిస్తే 40 తక్కువ ఇన్నింగ్స్‌లలోనే. ప్రస్తుతం ధోని 10,773 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. రోహిత్ ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే ఈ రికార్డు బద్దలు కావడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. తొలి రెండు.. మూడు ఓవర్లలోనే హిట్‌మ్యాన్ ఆ పరుగులు సాధించగలడు.

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు

  • 18,426 - సచిన్ టెండూల్కర్ (452 ​​ఇన్నింగ్స్)
  • 13,872 - విరాట్ కోహ్లీ (281 ఇన్నింగ్స్‌లు)
  • 11,363 - సౌరవ్ గంగూలీ (300 ఇన్నింగ్స్‌లు)
  • 10,889 - రాహుల్ ద్రవిడ్ (318 ఇన్నింగ్స్‌లు)
  • 10,773 - ఎంఎస్ ధోని (297 ఇన్నింగ్స్‌లు)
  • 10,767 - రోహిత్ శర్మ (255 ఇన్నింగ్స్‌లు) 

తొలి బంతికే వికెట్

కాగా, రెండో వన్డేలో ఇప్పటివరకూ 10 ఓవర్ల ఆట పూర్తి కాగా, ఆతిథ్య జట్టు వికెట్ నష్టపోయి 42 పరుగులు చేసింది. ఫామ్‌లో ఉన్న పతుమ్ నిశాంక(0)ను తొలి బంతికే సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. దాంతో, ఆతిథ్య జట్టు పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఆవిష్క ఫెర్నాండో(26 నాటౌట్), కుశాల్ మెండిస్(8 నాటౌట్) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.