SL vs IND: శ్రీలంకతో రెండో టీ20.. భారత తుది జట్టులో అనూహ్య మార్పు

SL vs IND: శ్రీలంకతో రెండో టీ20.. భారత తుది జట్టులో అనూహ్య మార్పు

శ్రీలంకపై తొలి టీ20లో అద్భుత విజయాన్ని అందుకున్న టీమిండియా.. నేడు రెండో పోరుకు సిద్ధమైంది. ఆదివారం(జులై 28) పల్లెకెలె వేదికగా ఈ ఇరు జట్ల మధ్య రెండో టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో, లంకేయులు మొదట బ్యాటింగ్ చేయనున్నారు. 

ఈ మ్యాచ్‌లో భారత జట్టులో ఊహించని మార్పు చోటుచేసుకుంది. శుభ్‌మన్ గిల్ స్థానంలో సంజు శాంసన్‌ను తుది జట్టులోకి వచ్చాడు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు గిల్ మెడ నొప్పితో బాధపడినట్లు తెలుస్తోంది. అందువల్లనే అతన్ని పక్కన పెట్టారని సమాచారం.

మ్యాచ్ ఆసల్యం  

ఆదివారం పల్లెకెలెలో భారీ వర్షం కురవడంతో స్టేడియం ఔట్ ఫీల్డ్ త‌డిగా మారింది. దాంతో, మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమవుతోంది. షెడ్యూల్ ప్రకారం 6:30 గంట‌ల‌కు వేయాల్సిన టాస్‌ను అంపైర్లు7:15కి వేశారు. మరో అర గంటలో అనగా 19:45 గంటలకు బాల్ పడనుంది. 

తుది జట్లు 

భారత్: యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్.

శ్రీలంక: పతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక(కెప్టెన్), వనిందు హసరంగా, దసున్ షనక, మహేశ్ తీక్షణ, రమేష్ మెండిస్, మతీష పతిరణ, అసిత ఫెర్నాండో.