పల్లకెలె వేదికగా భారత్- శ్రీలంక మధ్య జరగనున్న ఆఖరి టీ20 ఆలస్యమవుతోంది. తడి ఔట్ ఫీల్డ్ కారణంగా టాస్‌ను వాయిదా వేశారు. అయితే, ప్రస్తుతానికి వర్షం ఆటంకం లేకపోవడంతో.. పిచ్‌పై కప్పి ఉంచిన కవర్లను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. మరికొద్దిసేపట్లో అంపైర్లు మైదానాన్ని పరిశీలించనున్నారు. అనంతరం టాస్, ఆట ఆరంభంపై నిర్ణయం తీసుకోనున్నారు.
సిరీస్ వశం
కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు ఇప్పటికే 2-0 తేడాతో సొంతం చేసుకుంది. ఇది నామ మాత్రపు మ్యాచ్ కావడంతో భారత తుది జట్టులో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. మరోవైపు, ఈ మ్యాచ్‌లోనైనా విజయంతో పరువు కాపాడుకోవాలని లంక పట్టుదలతో ఉంది.
Update 🚨
— OneCricket (@OneCricketApp) July 30, 2024
The toss between India and Sri Lanka has been delayed due to a wet outfield.
📸: SonyLiv #SLvIND #Rain #Cricket pic.twitter.com/bt6Ek0WpV1