IND vs SL 2024: శ్రీలంకతో మూడో టీ20.. భారత జట్టులో భారీ మార్పులు

IND vs SL 2024: శ్రీలంకతో మూడో టీ20.. భారత జట్టులో భారీ మార్పులు

శ్రీలంకతో చివరిదైన మూడో టీ20 కు భారత్ సిద్ధమవుతుంది. పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆడిన తొలి రెండు మ్యాచ్ ల్లో టీమిండియా విజయం సాధించి సిరీస్ గెలిచింది. నేడు జరగబోయే మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తుంటే.. సొంతగడ్డపై చివరి టీ20 లో నైనా గెలిచి పరువు కాపాడుకోవాలని లంక భావిస్తుంది. ఈ మ్యాచ్ లో భారత్ తుది జట్టులో భారీ మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

రెండో టీ20 మ్యాచ్ కు గాయం కారణంగా బెంచ్ కు పరిమితమైన వైస్ కెప్టెన్ శుభమాన్ గిల్.. మూడో టీ20 మ్యాచ్ కు అందుబాటులో రానున్నాడు. అదే జరిగితే రెండో మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన సంజు శాంసన్ కు ప్లేయింగ్ 11 లో చోటు కోల్పోవడం గ్యారంటీ. మిడిల్ ఆర్డర్ లో పరాగ్ స్థానంలో దూబేకు ఛాన్స్ దక్కొచ్చు. సిరీస్ రావడంతో ఆల్ రౌండర్ వాషింగ్ టన్ సుందర్, ఖలీల్ అహ్మద్ లకు తుది జట్టులో ఆడించే అవకాశలు ఉన్నాయి. పేస్ బౌలర్ సిరాజ్, బిష్ణోయ్ లకు రెస్ట్ ఇవ్వొచ్చు. 

మరోవైపు శ్రీలంక రెండో మ్యాచ్‌‌‌‌లో ఆడిన జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది.  వరుసగా ఫెయిలైన దాసున్‌‌‌‌ షనక ప్లేస్‌‌‌‌లో అవిష్కా ఫెర్నాండో, దినేశ్‌‌‌‌ చండిమల్‌‌‌‌లో ఒకరికి అవకాశం ఇస్తారేమో చూడాలి. టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఆగస్టు 2, 4, 7న కొలంబోలో లంకతో వరుసగా మూడు వన్డేలు జరుగుతాయి.

భారత్ ప్లేయింగ్ 11 (అంచనా):

శుభమాన్ గిల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మరియు మహ్మద్ సిరాజ్.

శ్రీలంక ప్లేయింగ్ 11 (అంచనా):

పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), అవిష్క ఫెర్నాండో, కమిందు మెండిస్, చరిత్ అసలంక (కెప్టెన్), దసున్ షనక, వనిందు హసరంగా, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, దిల్షన్ మధుశంక.