శ్రీలంక, భారత్ మధ్య జరుగుతోన్న మూడో టీ20 ఆట 8:00 గంటలకు ప్రారంభం కానుంది. తడి ఔట్ ఫీల్డ్ కారణంగా ఆలస్యంగా టాస్ వేశారు. టాస్ గెలిచిన లంక సారథి చరిత అసలంక బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో, టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది.
నాలుగు మార్పులు
సిరీస్ ఇప్పటికే చేజిక్కించుకోవడంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగుతోంది. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రిషబ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్ నలుగురికి విశ్రాంతినిచ్చారు. మరోవైపు, లంక షనక స్థానంలో విక్రమసింఘేను జట్టులోకి తీసుకుంది.
మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే 2-0తో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు నామమాత్రపు మూడో టీ20లోనూ గెలిచి క్లీన్‌స్వీప్ చేయాలని భారత్ భావిస్తోంది. మరోవైపు, లంకేయులు చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి గౌరవప్రదంగా టీ20 సిరీస్‌ను ముగించాలని భావిస్తున్నారు.
తుది జట్లు
భారత్: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్.
శ్రీలంక: పతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత అసలంక(కెప్టెన్), చమిందు విక్రమసింఘే, వనిందు హసరంగా, రమేష్ మెండిస్, మహేశ్ తీక్షణ, మతీష పతిరణ, అసిత ఫెర్నాండో.
Four changes for India: Hardik, Axar, Arshdeep and Pant have been rested; Gill, Khaleel, Dube and Washington are in🔁
— ESPNcricinfo (@ESPNcricinfo) July 30, 2024
Chamindu Wickramasinghe makes his international debut for Sri Lanka 🧢
Follow ball-by-ball 👉 https://t.co/K0RzKUICIm #SLvIND pic.twitter.com/2JH6HjFvQT