పల్లెకెలె వేదికగా భారత్- శ్రీలంక మధ్య జరుగుతోన్న రెండో టీ20కి వర్షం అంతరాయం కలిగిస్తోంది. శ్రీలంక ఇన్నింగ్స్ పూర్తవ్వగా.. భారత బ్యాటింగ్ మొదలై మూడు బంతులు పడేసరికి.. వర్షం ప్రారంభమైంది. దాంతో, అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. సిబ్బంది పిచ్ అంతటిని కవర్లతో కప్పి ఉంచారు.
కుప్పకూలిన లంక
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా (53; 34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకంతో మెరవగా.. పతుమ్ నిశాంక (32), కమిందు మెండిస్ (26) పరుగులతో పర్వాలేదనిపించారు. ఒకానొక సమయంలో లంకేయులు 200 లక్ష్యాన్ని నిర్ధేశించేలా కనిపించినా.. ఒక్కసారిగా కుప్పకూలారు. 31 పరుగుల వ్యవధిలోనే చివరి 7 వికెట్లను కోల్పోయారు.
భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 3 వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య తలో రెండు వికెట్ల చెప్పున తీసుకున్నారు.
#INDvSL : 🚨 Rain interrupts the play!
— OneCricket (@OneCricketApp) July 28, 2024
📸 : Sony Liv pic.twitter.com/cGJHQOJVPz