IND vs SL: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. మోర్గాన్ ఆల్ టైమ్ రికార్డు బద్దలు

IND vs SL: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. మోర్గాన్ ఆల్ టైమ్ రికార్డు బద్దలు

శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డే ద్వారా భార‌త‌ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మరో మైలురాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మూడు సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్.. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు.

ఇప్పటివరకూ కెప్టెన్‌గా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 134 ఇన్నింగ్స్‌లలో 234 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో 234 సిక్సర్లతో ఇయాన్ మోర్గాన్ రెండో స్థానంలో ఉండగా.. 211 సిక్సర్లతో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మూడో స్థానంలో ఉన్నాడు.  

కెప్టెన్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు

  • రోహిత్ శర్మ: 134 ఇన్నింగ్స్‌ల్లో 234 సిక్సర్లు
  • ఇయాన్ మోర్గాన్: 180 ఇన్నింగ్స్‌ల్లో 233 సిక్సర్లు
  • ఎంఎస్ ధోని: 330 ఇన్నింగ్స్‌ల్లో 211 సిక్సర్లు
  • రికీ పాంటింగ్: 376 ఇన్నింగ్స్‌ల్లో 171 సిక్సర్లు
  • బ్రెండన్ మెకల్లమ్: 140 ఇన్నింగ్స్‌ల్లో 170 సిక్సర్లు

ఓపెనర్‌గా 15,000 పరుగులు

కాగా, ఈ మ్యాచ్‌లో రోహిత్ మరో మార్క్ చేరుకున్నాడు. ఓపెనర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో 15,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన భారత మూడో క్రికెటర్ హిట్‌మ్యాన్. వీరేంద్ర సెహ్వాగ్ (16,119), సచిన్ టెండూల్కర్ (15,335) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్ గా అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా 15,000కు పైగా పరుగులు చేసిన పదో క్రికెటర్‌ రోహిత్.