వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు వీరవిహారం చేస్తున్నారు. నాకౌట్ మ్యాచ్‌లకు ముందు లంక బౌలర్లతో ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఆడుతున్నారు. ముఖ్యంగా ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ(82), యువ బ్యాటర్ శుభ్ మాన్ గిల్(92)జోడి.. లంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ తృటిలో సెంచరీ చేసే అవకాశం కోల్పోయినా.. భారత జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. ప్రస్తుతం భారత జట్టు స్కోర్.. 199-3(32 ఓవర్లు).
రెండో బంతికే రోహిత్ బౌల్డ్
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి బంతిని బౌండరీగా మలిచిన రోహిత్.. అనంతరం రెండో బంతికే రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతని స్థానంలో క్రీజిలోకి వచ్చిన కోహ్లీ, శుభ్‌మన్ గిల్‌తో జత కలిసి జట్టును ముందుకు నడిపించాడు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఒకానొక దశలో ఇద్దరికీ సెంచరీలు చేసుకునే అవకాశం ఉన్నా.. అనవసరపు షాట్లకు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్నారు. గిల్(92) పరుగుల వద్ద ఔట్ అవ్వగా.. కోహ్లీ(88) రుగుల వద్ద వెనుదిరిగాడు.
King Kohli appreciating Shubman Gill with the Indian flag in the background...!!! ?? pic.twitter.com/jKbxLLKgQZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 2, 2023
లేచి చప్పట్లు కొట్టిన సారా
ఇదిలావుంటే, ఈ మ్యాచ్‌లో రోహిత్ వెనుదిరిగాక మరో వికెట్ పడనివ్వకుండా బాధ్యతగా ఆడిన శుభ్‌మన్ గిల్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అతడు ఔటై పెవిలియన్ వైపు వెళ్తుండగా సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా.. అతన్ని అప్రిషియేట్ చేస్తూ లేచి చప్పట్లు కొట్టింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వీరి ఊహాజనిత ప్రేమ మరోసారి తెరపైకి వస్తోంది.
ALSO READ : ODI World Cup 2023: ఒకే ఒక్కడు: సచిన్ ఆల్‌టైం రికార్డ్ బద్దలు కొట్టిన కోహ్లీ
Sara Tendulkar clapping and appreciating Shubman Gill's Incredible innings. pic.twitter.com/5QKzyjjQn2
— CricketMAN2 (@ImTanujSingh) November 2, 2023
I don’t know how to express this pain but same Sara didi same #INDvSL pic.twitter.com/6z8CNquRyT
— Fenil Kothari (@fenilkothari) November 2, 2023