ఆసియా కప్ ఫైనల్ పోరులో లంకేయులు తడబడుతున్నారు. భారత బౌలర్ల ధాటికి పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. మ్యాచ్ తొలి ఓవర్‌లోనే బుమ్రా వికెట్ తీయగా.. 4వ ఓవర్‌లో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో శ్రీలంక మొదటి 4 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
టాస్ గెలిచి శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. బుమ్రా వేసిన తొలి ఓవర్‌లోనే లంక వికెట్ కోల్పోయింది. మూడో బంతికి ఓపెనర్ కుశాల్ పెరీరా(0).. కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం 4వ ఓవర్‌లో సిరాజ్ నలుగురిని పెవిలియన్ చేర్చాడు. మొదటి బంతికి పాథుమ్ నిశాంక (2) క్యాచ్ ఔట్ అవ్వగా.. మూడో బంతికి సమరవిక్రమ (0) ఎల్బిడబ్ల్యూ, నాలుగో బంతికి చరిత్ అసలంక (0) క్యాచ్ ఔట్, ఆఖరి బంతికి ధనంజయ డిసిల్వా (4) క్యాచ్ ఔట్ గా వెనుదిరిగారు.
#AsiaCup2023 #INDvSL #Siraj #AsianCup2023
— ??⭐ (@superking1816) September 17, 2023
This is appreciation post for Mohammad Siraj no Fans Will pass without liking this Post ❤️pic.twitter.com/rlOBzLDCFd
This is funny but Kuddos to him for chasing the ball ??? #Siraj
— Juhi Jain (@juhijain199) September 17, 2023
pic.twitter.com/DvRs3DcZWP