పాకిస్తాన్‌పై దంచి కొట్టిన భారత టాపార్డర్ శ్రీలంక స్పిన్ ధాటికి విలవిలాలాడిపోయారు. పిచ్ స్పిన్‌కు అనుకూలించడంతో లంకేయుల మాయాజాలానికి పెవిలియన్‌కు క్యూ కట్టారు. 49.1 ఓవర్లలో 213 పరుగుల వద్ద భారత ఇన్నింగ్స్ ముగిసింది.20 ఎల్లా కుర్ర బౌలర్ దునిత్ వెల్లలాగే 5 వికెట్లతో అదరగొట్టగా.. పార్ట్ టైమ్ స్పిన్నర్ చరిత అసలంక 4 వికెట్లతో చెలరేగాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు మంచి ఆరంభం లభించింది. రోహిత్ శర్మ(53)- శుభ్‌మన్ గిల్(19) జోడి తొలి వికెట్ కు 11 ఓవర్లలో 80 పరుగులు జోడించారు. అక్కడినుండి మ్యాచ్ తలకిందలైంది. బాల్ అందుకున్న దునిత్ వెల్లలాగే తొలి బంతికే గిల్‌ను బౌల్డ్ చేశారు. ఆ తర్వాత వరుస ఓవర్లలో రోహిత్ (53), కోహ్లీ(3) కూడా ఔట్ అవ్వడంతో స్కోర్ బోర్డు మందగించింది.
ఆపై కాసేపు కేఎల్ రాహుల్(39)- ఇషాన్ కిషన్(33) జోడికుదురుకున్నా.. రాహుల్ వెనుదిరిగాక భారత్ ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. హార్దిక్ పాండ్యా(5), రవీంద్ర జడేజా(4), జస్ప్రీత్ బుమ్రా(5) కుల్దీప్ యాదవ్(0).. ఇలా ఒకరివెంట మరొకరు పెవిలియన్ చేరారు. లంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే 5 వికెట్లు తీసుకోగా.. అసలంక నాలుగు వికెట్లు పడగొట్టాడు.
Innings Break!#TeamIndia post 213 on the board.
— BCCI (@BCCI) September 12, 2023
Over to our bowlers now, second innings coming up shortly! ⌛️
Scorecard ▶️ https://t.co/P0ylBAiETu#AsiaCup2023 | #INDvSL pic.twitter.com/5b08DhVQAD
Maiden Five-fer Alert! ? Dunith Wellalage was on fire today, delivering an incredible performance! ?
— Sri Lanka Cricket ?? (@OfficialSLC) September 12, 2023
Shubman Gill ☝️
Virat Kohli ☝️
Rohit Sharma ☝️
KL Rahul ☝️
Hardik Pandya ☝️#LankanLions #AsiaCup2023 #SLvIND pic.twitter.com/6ewfoYndNM