భారత గడ్డపై భారత బౌలర్లను ఎదుర్కొంటూ 358 పరుగుల లక్ష్యాన్ని చేధించడమంటే లంకేయులకు చాలా కష్టం. ఈ విషయం వారికి తెలుసు. ఒకవేళ పోరాడదాం అనుకున్నా.. ఏ ఒకరిద్దరూ రాణించాలి. అందుకు మళ్లీ కష్టడాలి. వికెట్ల మధ్య పరుగెత్తాలి.. బౌండరీలు సాధించాలి. అయినా గెలుస్తారా! గెలవరు. అదే త్వరగా ఔటైతే ఇంకో మ్యాచ్ కు సన్నద్ధమవ్వచ్చు. అచ్చం లంక బ్యాటర్లు ఇదే ఫార్ములా అనుసరిస్తున్నారు. పోరాడితే ఎక్కడ అలిసిపోతామో అని త్వరగా ఔటైపోయి డగౌట్‌లో కూర్చుంటున్నారు.
358 పరుగుల లక్ష్య చేధనలో లంక బ్యాటర్లు కనీస పోరాటం కూడా చేయట్లేదు. హైదరాబాదీ బిడ్డ మహమ్మద్ సిరాజ్ విసురుతున్న నిప్పులు చెరిగే బంతులకు కుదేలైపోతున్నారు. క్రీజులో నిలబడటానికే నానా అవస్థలు పడుతున్నారు. ఇన్నింగ్స్ మొదలైన తొలి బంతికే వికెట్ కోల్పోయిన లంక.. తొలి నాలుగు ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. వీరిలో ముగ్గురు డకౌట్ కాగా, మరొక బ్యాటర్ ఒక పరుగు సాధించాడు.
ఓపెనర్లు నిశ్సాంక(0), దిమిత్ కరుణరత్న(0), సమర విక్రమ(0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరగా.. కుషాల్ మెండిస్(1) ఒక పరుగు చేశాడు. భారత బౌలర్లలో సిరాజ్వి మూడు కెట్లు తీయగా.. బూమ్రా ఒక వికెట్ తీశాడు.
W, 0, 0, 0, W, 0, W BY SIRAJ...!!!!
— Johns. (@CricCrazyJohns) November 2, 2023
3 wickets in just 7 balls. This is crazy. pic.twitter.com/jjUKsMpokP
MOHAMMED SIRAJ DESTROYING SRI LANKA....!!!
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 2, 2023
3rd wicket in just 7 balls, he's on fire!!! pic.twitter.com/5f6ezTkNPG