టీ20 ప్రపంచకప్ విజయం, జింబాబ్వే పర్యటన అనంతరం భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. శనివారం(జులై 27) ఈ ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరుగుతోంది. పల్లెకెలె వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో లంక సారథి చరిత అసలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో, టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది.
శాంసన్‌కు నిరాశ
జట్టుతో కలిసి ఎన్ని విదేశీ పర్యటనలకు వెళ్లినా.. వికెట్ కీపర్ సంజూ శాంసన్ కు మాత్రం తప్పడం లేదు. జట్టులో స్టార్ బ్యాటర్లు లేనప్పటికీ, అతను మాత్రం బెంచ్‌కు పరిమితమవుతూనే ఉన్నాడు. నేటి మ్యాచ్‌లోనూ అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు.
రోహిత్, కోహ్లీలను భర్తీ చేసేదెవరు..?
స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలు పొట్టి ఫార్మాట్ నుంచి వైదొలగడంతో యువ బ్యాటర్లు ఎలా రాణిస్తారనేది ఈ సిరీస్‌తో తేలనుంది. సొంతగడ్డపై లంక జట్టును తక్కువ అంచనా వేయలేం. అందునా, నిన్నమొన్నటి దాకా లంకేయులు ప్రీమియర్ లీగ్‌లో రాణించి మంచి ఫామ్‌లో ఉన్నారు.
తుది జట్లు
భారత్: శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రిషభ్ పంత్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్య, రింకు సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక: పతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక(కెప్టెన్), వనిందు హసరంగా, దసున్ షనక, మహేశ్ తీక్షణ, మతీష పతిరణ, అసిత ఫెర్నాండో, దిల్షన్ మధుశంక.