IND vs SL: శ్రీలంకకు మరిన్ని కష్టాలు.. సిరీస్ నుండి స్టార్ ఆల్‌రౌండర్ ఔట్

IND vs SL: శ్రీలంకకు మరిన్ని కష్టాలు.. సిరీస్ నుండి స్టార్ ఆల్‌రౌండర్ ఔట్

ఆతిథ్య శ్రీలంక జట్టును గాయాల బెడద వీడటం లేదు. ఇప్పటికే ఐదు పేసర్లు దూరమై ఆపసోపాలు పడుతున్న లంకకు మరో కష్టమొచ్చింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వ‌నిందు హ‌స‌రంగ‌, వ‌న్డే సిరీస్‌లో ఆఖ‌రి రెండు మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యాడు. తొడ కండ‌రాల గాయంతో బాధ ప‌డుతున్న హ‌స‌రంగ‌ వన్డే సిరీస్ నుంచి వైదొలిగినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు SLC ప్రకటన చేసింది. అతని స్థానంలో 34 ఏళ్ల లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే జట్టులోకి వచ్చాడు.

తొలి వన్డేలో అద్భుత ప్రదర్శన 

భారత్, శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డే 'టై'గా ముగినప్పటికీ, హ‌స‌రంగ‌ అద్భుతంగా రాణించాడు. బ్యాటింగ్‌లో 24 పరుగులు చేయడంతో పాటు మూడు వికెట్లు పడగొట్టాడు. ప్రమాదకర బ్యాటర్ విరాట్ కోహ్లీ సహా కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్‌లను  వెనక్కి పంపాడు. అలాంటి ఆటగాడు దూరమవ్వటం ఆతిథ్య జట్టుకు గట్టి దెబ్బేనని చెప్పుకోవాలి.