టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ చేసే చిలిపి చేష్టల గురుంచి చెప్పాలంటే సమయం సరిపోదు. సహచర ఆటగాళ్లను ఆటపట్టించమంటే కోహ్లీకి మహా సరదా. ఇప్పటికే ఎన్నోసార్లు అలాంటి చిలిపి పనులు చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. తాజాగా, ఈ మాజీ సారథి అల్లరి చేష్టలకు హార్దిక్ పాండ్యా బలయ్యారు.
వెస్టిండీస్‌తో తొలి వన్డేకి ముందు కోహ్లీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులు ఎదుర్కోవడానికి ఇబ్బంది పడుతున్న విరాట్.. దాన్ని అధిగమించేందుకు నెట్స్లోగంటల పాటు చెమటలు చిందించారు. పాండ్యా చేత ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులను వేపించుకొని మరీ ప్రాక్టీస్ చేశారు. అయితే ఈ ప్రాక్టీస్‌లో కోహ్లీ.. పాండ్యా సంధించిన ఓ ఆఫ్ స్టంఫ్ బంతిని తన ట్రేడ్ మార్క్ షాట్ అయిన కవర్ డ్రై ఆడారు.
దీంతో ఆశ్చర్యపోయిన పాండ్యా.. మరో బాల్ వేస్తా ఆడు చూద్దాం.. అన్నట్లుగా కోహ్లీ వైపు చూశారు. వెంటనే కోహ్లీ.. పాండ్యాను ఎక్కిరిస్తూ.. ఫోర్ కొట్టినట్లు స్టెప్పులేస్తూ నవ్వులు పంచారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. క్రికెట్ అభిమానులు ఈ వీడియో చూసి.. కోహ్లీ అల్లరి చేష్టలు భలే ఉంటాయంటూ కామెంట్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరూ చేసేసి.. కాసేపు కడుపుబ్బా నవ్వుకోండి.
— Out Of Context Cricket (@GemsOfCricket) July 27, 2023