అసలే ఓడి ఏడుస్తుంటే మరో దెబ్బ: భార‌త జట్టుకు షాకిచ్చిన మ్యాచ్ రిఫ‌రీ

అసలే ఓడి ఏడుస్తుంటే మరో దెబ్బ: భార‌త జట్టుకు షాకిచ్చిన మ్యాచ్ రిఫ‌రీ

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. అచ్చొచ్చిన టీ20 ఫార్మాట్‌లో విండీస్ నిర్ధేశించిన నామమాత్రపు 150 పరుగుల లక్ష్యాన్ని భారత బ్యాటర్లు చేధించలేకపోయారు. ఆఖరిబంతి వరకూ పోరాడినా భారత జట్టు విజయానికి 4 పరుగుల దూరంలో ఉండిపోయింది. 

అసలే మ్యాచ్ ఓడి బాధలో టీమిండియాకు మ్యాచ్ రిఫ‌రీ రిచీ రిచ‌ర్డ్‌స‌న్ మరో షాకిచ్చారు. తొలి టీ20లో టీమిండియా, విండీస్‌ నిర్ణీత స‌మ‌యంలో ఓవ‌ర్ల కోటా పూర్తి చేయ‌ని విష‌యాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు ఐసీసీ.. భారత్, వెస్టిండీస్‌లకు జరిమానా విధించింది.

మినిమమ్ ఓవర్ రేట్ కంటే ఒక ఓవర్ తక్కువగా వేసిన‌ భార‌త జట్టుకు మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధించగా, రెండు ఓవ‌ర్లు ఆల‌స్యంగా వేసిన‌ విండీస్‪కు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది. కాగా, ఈ విజయంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో ఆతిథ్య విండీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ ఇరు జట్ల మధ్య గయానా వేదికగా ఆదివారం(ఆగష్టు 6) రెండో టీ20 జరగనుంది.