ఇండియా- వెస్టిండీస్ మద్య జరగనున్న తొలి టీ20లో విండీస్ కెప్టెన్ రోవ్మన్ పావెల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్ ఎంచుకోవటం వ్యూహం కాదన్న పావెల్.. భారత స్పిన్నర్లను ఎదుర్కోవటానికి ఇదే సరైన దారని తెలిపారు.
ఈ మ్యాచ్లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్ల(అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్)తో బరిలోకి దిగుతోంది. అలాగే, ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.. ఢిల్లీ క్యాపిటల్స్ యువ బౌలర్ ముకేశ్ కుమార్ ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టీ20 ల్లో అరంగ్రేటం చేశారు.
తుది జట్లు:
ఇండియా: శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్.
వెస్టిండీస్: కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ (వికెట్ కీపర్), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మాన్ పావెల్ (కెప్టెన్), జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్.