వీడియో: బెడిసికొట్టిన ప్రయోగాలు.. తల పట్టుకున్న విరాట్ కోహ్లీ

వీడియో: బెడిసికొట్టిన ప్రయోగాలు.. తల పట్టుకున్న విరాట్ కోహ్లీ

వెస్టిండీస్‌(West Indies)తో రెండో వన్డేలో టీమిండియా(Team India) 6 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 181 పరుగులకే కుప్పకూలగా.. అనంతరం విండీస్ బ్యాటర్లు ఆ లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేధించారు. ఈ మ్యాచ్‌లో భారత మేనేజ్మెంట్ చేసిన ప్రయోగాలు బెడిసికొట్టాయి. 

బెడిసికొట్టిన ప్రయోగాలు

వన్డే ప్రపంచకప్‌ 2023 పోరుకు ఎక్కువ సమయం లేకపోవడంతో.. యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని సీనియర్లైన విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ()Rohith Sharma)లను విశ్రాంతి పేరుతో పక్కనపెట్టింది. అయితే కుర్రాళ్లు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. ప్రత్యర్థి జట్టులో ప్రచండ బౌలర్లు లేకపోయినా.. అనవసర షాట్లకు పోయి వికెట్లు పారేసుకున్నారు. సంజూ శాంసన్‌, హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ ఔటైన తీరు చూస్తే.. తప్పుడు షాట్‌ సెలెక్షన్‌ అని చెప్పకనే చెప్పొచ్చు.

తల పట్టుకున్న కోహ్లీ

స్కాట్లాండ్(Scotland), నెదర్లాండ్స్(Netherlands) వంటి పసికూన జట్ల చేతిలో ఓడిన విండీస్ చేతిలో పరాయజం పాలవ్వడం అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శన కోహ్లీని కూడా తీవ్ర నిరాశపరిచింది. డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి మ్యాచ్‌ను వీక్షించిన కోహ్లీ.. విండీస్ విజయం సాధించగానే అయ్యో అని తల పట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఇక మూడో వన్డేకు విరాట్‌, రోహిత్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 40.5 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ ఇషాన్‌ కిషన్ (55) పరుగులతో రాణించగా.. మిగిలిన బ్యాటర్లంతా పెవిలియన్ కు క్యూ కట్టారు. అనంతరం 182 పరుగుల లక్ష్యాన్ని 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమం కాగా, కీలకమైన సిరీస్ డిసైడర్ మ్యాచ్ మంగళవారం(ఆగస్ట్ 1) జరగనుంది.