రెండో వన్డేలో టీమిండియా ఓటమి.. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మెడకు చుట్టుకుంది. ప్రయోగాలు బెడిసికొట్టడమే అందుకు ప్రధాన కారణం. వన్డే ప్రపంచకప్ కోసం సరైన జట్టును సిద్ధం చేసేందుకు ద్రావిడ్ ప్రయత్నించడం సరైన నిర్ణయమే అయినా.. విశ్రాంతి పేరుతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని దూరంగా ఉంచడాన్ని అభిమానులు వేలెత్తి చూపుతున్నారు.
ద్రావిడ్‌ను తప్పించాలి
ఈ ఏడాది స్వదేశంలో జరగబోయే వన్డే ప్రపంచ కప్‌ను టీమిండియా సొంతం చేసుకోవాలంటే ద్రావిడ్‌ను హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పించాల్సిందేనని నెటిజన్స్ పట్టుబడుతున్నారు. ది వాల్ కోచ్‌గా ఉన్నారనే పేరు తప్ప.. జట్టుకు ఒరిగిందేమి లేదని వారు ఆరోపిస్తున్నారు. ద్రావిడ్ హెడ్ కోచ్‌గా వచ్చాకే టీమిండియా కీలక మ్యాచ్‌లు ఓడిపోతోందని.. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్, సౌతాఫ్రికాతో టెస్టు, వన్డే సిరీస్, 2022 ఆసియాకప్, 2022 టీ20 ప్రపంచకప్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్.. ఇలా అన్నింటా ఓటములే అని ఆరోపిస్తున్నారు.
Rahul Dravid as a coach :
— Cricket SuperFans (@cricketrafi) July 29, 2023
- lost 2021 T20 wc
- lost odi series against ban
- lost test series against sa
- lost odi series against sa
- lost asia cup
- lost 2022 T20 wc
- lost ODIs series against aus
- lost WTC final#RahulDravid #IndianCricket #HardikPandya #INDvWI… pic.twitter.com/Dt7oJzNZD4
ట్రెండింగ్‌లో #SackDravid హ్యాష్‌ట్యాగ్
రాహుల్ ద్రావిడ్‌ను హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించాలని ట్విట్టర్ వేదికగా అభిమానులు నానా హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలో #SackDravid అనే హ్యాష్‌ట్యాగ్ వైరల్ చేస్తున్నారు. అందునా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వన్డే జట్టులో నాలుగో స్థానానికి సరైన ఆటగాడిని ఎంపిక చేయలేక పోతుండడం కూడా ద్రావిడ్ వైఫల్యాన్ని వేలెత్తి చూపుతోంది.
Now ive become death, the destroyer of Indian Cricket team with my politics.#sackdravid? pic.twitter.com/oaNSKfy83q
— ????????? (@SergioCSKK) July 29, 2023