టీమిండియాతో జరుగుతోన్న రెండో వన్డేలో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందని అంచనా వేసిన విండీస్ కెప్టెన్ షాయ్ హోప్.. భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. సిరీస్ సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ లో విండీస్ తప్పక గెలవాల్సిందే. కాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో ఉంది.
రోహిత్, కోహ్లిలకు విశ్రాంతి
రెండో వన్డేలో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు విశ్రాంతినివ్వడంతో హార్దిక్ పాండ్యా పగ్గాలు చేపట్టాడు. రోహిత్, కోహ్లి స్థానాల్లో సంజూ శాంసన్, అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చారు.
తుది జట్లు
టీమిండియా: శుబ్‌మాన్ గిల్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.
వెస్టిండీస్: బ్రెండన్ కింగ్, కైల్ మేయర్స్, అలీక్ అథనాజ్, షాయ్ హోప్(వికెట్ కీపర్/కెప్టెన్), షిమ్రాన్ హెట్మైర్, కీసీ కార్టీ, రొమారియో షెఫర్డ్, యాన్నిక్ కరియా, గుడకేష్ మోటీ, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్.