![Ind vs WI 2nd T20I: బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా.. మిస్టరీ స్పిన్నర్ ఎంట్రీ](https://static.v6velugu.com/uploads/2023/08/Ind-vs-WI-2nd-T20I-India-won-t_nw3GEkiBcP.jpg)
వెస్టిండీస్‌తో జరుగుతోన్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. విండీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటామన్న హార్దిక్ పాండ్యా.. కరేబియన్ జట్టు ముందు భారీ లక్ష్యాన్ని నిర్ధేశిస్తామని తెలిపారు. ఈ మ్యాచ్‌లో కుల్ దీప్ స్థానంలో రవి బిష్ణోయ్ జట్టులోకి వచ్చారు. కాగా తొలి టీ2లో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ను 1-1తో సమం చేయాలని చూస్తోంది.
తుది జట్లు:
భారత్: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజు శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, రవి బిష్ణోయ్.
వెస్టిండీస్: బ్రెండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్.