అందమైన భామలను కలవాలంటే సాధారణ పౌరులకు కష్టమేమో కానీ ఆటగాళ్లకు ఎంత సేపు చెప్పండి. ఒకసారి ఫేమ్ వచ్చాక వారే వీళ్ల దగ్గరకు వస్తుంటారు. కలిసి ఫోటోలు దిగుతుంటారు. వెస్టిండీస్ పర్యటనలో భారత యువ ఆటగాళ్లకు అలాంటి సందర్భమే ఎదురైంది. ఉన్నట్టుండి ఓ అందాల భామ స్టేడియంలో ప్రత్యక్షమై ఫోటో కావాలని అడిగింది. ఇంకేముంది.. కుర్రాళ్లు వెంటనే ముసిముసినవ్వులు చిందిస్తూ ఆమెతో కలిసి ఫోటోలు దిగారు.
ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు మిస్ వరల్డ్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో ఆచె ఆబ్రహామ్స్ స్టేడియానికి విచ్చేసింది. ఎలానూ మిస్ వరల్డ్ కావున ఆటగాళ్లను కలవడానికి ఆమెకు ఎంతో సమయం పట్టలేదు. భారత యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్‌లను కలిసిన ఆమె.. కాసేపు వారితో మాటామంతి జరిపింది. అనంతరం వారితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి కనబర్చింది. అంతటితో ఆగిందా! అంటే అదీ లేదు. నేను ఎవరిని కలిశానో తెలుసా? అంటూ ఆబ్రహామ్స్ ఆ ఫోటోలను తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఎక్కడ చూసినా అవే ఫోటోలు దర్శనమిస్తున్నాయి.
Miss World Aché Abrahams from Trinidad & Tobago meets Indian cricketers Shubman Gill, Yashasvi Jaiswal, and Ishan Kishan, expressing her delight and excitement during their interaction.
— CricTracker (@Cricketracker) July 22, 2023
?: RevSportz pic.twitter.com/dyVo4FpvNt
Miss World Aché Abrahams of Trinidad & Tobago meets Shubman Gill & Ishan Kishan.
— RevSportz (@RevSportz) July 22, 2023
In this interview she shares her excitement and joy of interacting with the Indian cricketers.@Wowmomo4u @debasissen #WIvIND pic.twitter.com/RCQwRWARl9
ఇదిలావుంటే రెండో టెస్టులో భారత జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగుల భారీ స్కోర్ చేసిన టీమిండియా.. వెస్టిండీస్‌ని ఆలౌట్ చేసే పనిలో పడింది. అయితే విండీస్ వీరులు జిడ్డు బ్యాటింగ్ తో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. పరుగులు చేయకుండా వికెట్లు కాపాడడానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ జట్టు ఇంకా 209 పరుగుల వెనుకబడి ఉంది.