భారతీయుడి దెబ్బ అట్లుంటది: గిల్ దెబ్బకు పాక్ బ్యాటర్ల రికార్డులు బద్దలు

భారతీయుడి దెబ్బ అట్లుంటది: గిల్ దెబ్బకు పాక్ బ్యాటర్ల రికార్డులు బద్దలు

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ట్రినిడాడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో టీమిండియా 200 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచులో పరుగుల మోత మోగించిన భారత యువ క్రికెటర్లు.. పలు రికార్డులను కొల్లగొట్టారు. 

దిగ్గజాల సరసన ఇషాన్ కిషన్

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలోనూ హాఫ్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్ దిగ్గజాల సరసన చేరారు. ద్వైపాక్షిక సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు కొట్టిన ఆరో భారత బ్యాటర్‌గా రికార్డుకెక్కారు. తొలి వన్డేలో 52 పరుగులు చేసిన ఇషాన్.. రెండో వన్డేలో 55, చివరి వన్డేలో 77 పరుగులు చేశారు. దీంత మాజీ క్రికెటర్లు  కృష్ణమాచారి, దిలీప్ వెంగ్‌సర్కార్, మహమ్మద్ అజారుద్దీన్, మహేంద్ర సింగ్ ధోనీ, శ్రేయస్ అయ్యర్‌ల సరసన నిలిచారు.

గిల్ దెబ్బకు పాక్ అభిమానులు ఏడుపు

రెండో వన్డేలో 34 పరుగులతో పర్వాలేదనిపించిన శుభ్‌మాన్ గిల్.. మూడో వన్డేలో బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. 92 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 85 పరుగులు చేశారు. కాస్తంతలో సెంచరీ మిస్‌ అయినా.. ఈ ఇన్నింగ్స్‌తో గిల్ పాకిస్తాన్‌ బ్యాటర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు.

27 వన్డే ఇన్నింగ్స్‌లలో ఇమామ్‌ 1381 పరుగులు చేయగా.. గిల్ 62.48 సగటుతో 1437 పరుగులు చేశారు. ఇక గత మ్యాచ్‌లో 1352 పరుగుల వద్ద ఉన్న గిల్‌.. బాబర్‌ ఆజం(1322)ను అధిగమించిన విషయం తెలిసిందే. ఈ రికార్డును ప్రస్తావిస్తూ భారత అభిమానులు.. పాక్ బ్యాటర్లను నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. 

27 వన్డే ఇన్నింగ్స్‌లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు

  • 1. శుబ్‌మన్‌ గిల్‌ - 1437
  • 2. ఇమామ్ ఉల్‌ హక్‌ - 1381
  • 3. రాసీ వాన్‌ డెర్‌ డసెన్‌ - 1353
  • 4. ర్యాన్ టెన్‌ డష్కాటే - 1353
  • 5. జొనాథన్‌ ట్రాట్‌ - 1342