సూర్య మెరుపు ఇన్నింగ్స్.. టీమిండియా ఘన విజయం

సూర్య మెరుపు ఇన్నింగ్స్.. టీమిండియా ఘన విజయం

సిరీస్ డిసైడ‌ర్ మ్యాచ్‌లో భారత బ్యాట‌ర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా మిస్టర్ ఇండియా 360 సూర్యకుమార్ యాదవ్.. వినూత్న షాట్లు ఆడుతూ విండీస్ బౌలర్లకు మతి పోగొట్టాడు. 44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేసిన సూర్య ఒంటి చేత్తో జట్టుకు విజయాన్ని అందించి పెట్టాడు. 

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రెండన్ కింగ్ 42 బంతుల్లో 42 పరుగులు చేయగా, ఆఖరిలో విండీస్ కెప్టెన్ రొవ‌మ‌న్ పావెల్ 19 బంతుల్లో 40 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు టికెట్లు తీసుకోగా.. అక్షర పటేల్, ముఖేష్ కుమార్ చెరో వికెట్ తీసుకున్నారు.

అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాటర్లు మరో 13 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ 44 బంతుల్లో 83 పరుగులు చేయగా, యువ బాటర్ తిలక్ వర్మ 49 పరుగులతో రాణించాడు.

ఈ విజయంతో భారత జట్టు ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 1-2 తేడాతో రేసులో నిలబడగలిగింది. ఇక ఇరు జట్ల మధ్య శనివారం అమెరికా(ఫ్లోరిడా) వేదికగా నాలుగో టీ20 జరగనుంది.