ఇండియాతో జరుగుతోన్న నాలుగో టీ20లో వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది. షిమ్రాన్ హెట్‌మైర్(61; 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ బాదగా.. షై హోప్(45; 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులతో రాణించాడు. దీంతో నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి కరేబియన్ జట్టు 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన విండీస్ బ్యాటర్లు దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. కైల్ మేయర్స్(17), బ్రెండన్ కింగ్(18) జోడి.. ఎడా పెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అయితే కుల్దీప్ యాదవ్ ఎంట్రీతో 57 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో హోప్(45), హెట్‌మైర్(61) విండీస్‌ను ఆదుకున్నారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీసుకోగా.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశారు.
A defiant knock from Hetmyer ? ? #WIHOME #WIvIND #KuhlT20 pic.twitter.com/VbR2SOXQjM
— Windies Cricket (@windiescricket) August 12, 2023
ఆశలన్నీ సూర్యపైనే
ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ రాణించడంపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. విండీస్ జట్టులో వరల్డ్ క్లాస్ బౌలర్లు లేనప్పటికీ.. 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంటే తేలిక కాదు. వికెట్లు కోల్పోకుండా సరైన భాగస్వామ్యాలు నెలకోల్పుతూ లక్ష్యాన్ని చేధించాలి. ఏమాత్రం వికెట్లు పడినా.. అది మిగిలిన ఆటగాళ్లపై అదనపు ఒత్తిడిని పెంచుతుంది.