ఐపీఎల్ వీరుడికి చోటు.. భారత్‌ను ఢీకొట్టబోయే విండీస్‌ వన్డే జట్టు ఇదే

ఐపీఎల్ వీరుడికి చోటు.. భారత్‌ను ఢీకొట్టబోయే విండీస్‌ వన్డే జట్టు ఇదే

కరేబియన్ గడ్డపై భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య గురువారం నుంచి మూడు మ్యాచుల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును విండీస్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు షై హోప్‌ నాయకత్వం వహిస్తుండగా.. ఐపీఎల్ హీరో(రాజస్థాన్ రాయల్స్ అతగాడు) షిమ్రోన్ హెట్‌మైర్‌కు జట్టులో అవకాశం కల్పించారు.

పూరన్‌, హోల్డర్‌ దూరం

ఈ సిరీస్‌కు విండీస్ స్టార్‌ బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌, ఆల్‌రౌండర్‌ జాసన్‌ హోల్డర్‌ దూరమయ్యారు. పూరన్‌ అమెరికా వేదికగా జరగుతున్న మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీలో బీజీగా ఉండగా.. జాసన్ హోల్డర్‌కు విశ్రాంతినిచ్చారు.

వెస్టిండీస్ వన్డే జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనాజ్, యానిక్ కరియా, కీసీ కార్టీ, డొమినిక్ డ్రేక్స్, షిమ్రాన్ హెట్మెయర్, అల్జారీ జోసెఫ్, బ్రెండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, జేడెన్ సీల్స్, రొమారియో షెఫర్డ్, కెవిన్ సింక్లైర్, ఒషేన్ థామస్.

ఇండియా vs వెస్టిండీస్ వన్డే సిరీస్ షెడ్యూల్

  • తొలి వన్డే: 27 జూలై (కెన్సింగ్టన్ ఓవల్, బార్బడోస్)
  • రెండో వన్డే: 29 జూలై (కెన్సింగ్టన్ ఓవల్, బార్బడోస్)
  • మూడో వన్డే: 1 ఆగష్టు (బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ, ట్రినిడాడ్)

టెస్టు సిరీస్‌ టీమిండియాదే..

క్వీన్స్ పార్కును వరుణుడు ముంచెత్తడంతో ఇండియా- వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్ట్ డ్రాగా ముగిసింది. దీంతో తొలి టెస్టు గెలిచిన భారత్‌ రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్‌ను 1–0తో సొంతం చేసుకుంది.